ఉమెన్‌ హ్యాండ్‌ బాల్‌ టీమ్‌ ప్లేయర్‌గా ఎంపికైన మడావి కరీనా

సత్కరించి అభినందించిన మంత్రి సత్యవతి

హైదరాబాద్‌,జూలై26(జనంసాక్షి): ఐహెచ్‌ఎఫ్‌ మహిళల యూత్‌ వరల్డ్‌ చాంపియన్‌షిప్‌ పోటీల్లో పాల్గొనేందుకు నేషనల్‌ యూత్‌ ఉమెన్‌ హ్యాండ్‌ బాల్‌ టీమ్‌ ప్లేయర్‌గా ఎంపికైన మడావి కరీనాను రాష్ట్ర మంత్రి సత్యవతి రాథోడ్‌ అభినందించారు. ఈ సందర్భంగా కరీనాను శాలువాతో సత్కరించారు. ఈ పోటీలు జులై 30 నుంచి ఆగస్టు 10వ తేదీ వరకు నార్త్‌ మెసిడోనియాలోని స్కోప్జేలో జరగనున్నాయి. ఆసిఫాబాద్‌ జిల్లా వాంకిడి మండలం చిచ్చుపల్లి గ్రామానికి చెందిన మడావి కరీనా.. తెలంగాణ ట్రైబల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ కాలేజీలో సీఈసీ సెకండియర్‌ చదువుతోంది. ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్‌ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్‌ రాష్ట్రంలో క్రీడా రంగానికి పెద్దపీట వేశారన్నారు. అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా క్రీడాకారులను, కోచ్‌ లను ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని స్పష్టం చేశారు. ఆసిఫాబాద్‌ జిల్లాలోని మారుమూల గ్రామంలో జన్మించిన కరీనా అంతర్జాతీయ స్థాయి ఆటలకు సెలెక్ట్‌ అవడం చాలా సంతోషకరమని, తనకు ప్రభుత్వం తరఫున అన్ని విధాల అండగా ఉంటామని మంత్రి సత్యవతి రాథోడ్‌ హావిూ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ట్రైబల్‌ వేల్ఫేర్‌ రీజనల్‌ కోఆర్డినేటర్‌ గంగాధర్‌, హ్యాండ్‌ బాల్‌ అసోసియేషన్‌ సెక్రటరీ రమేష్‌, ప్రిన్సిపల్‌ రమ్య, కోచ్‌ అరవింద్‌, హ్యాండ్‌బాల్‌ అసోసియేషన్‌ కన్వీనర్‌ కే రాకేష్‌, డైరెక్టర్‌ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు