ఉమ్మడిజిల్లా కాంగ్రెస్ కార్యదర్శిగా నారాయణగౌడ్ ఎన్నిక
నారాయణగౌడ్‌ను సన్మానిస్తున్న కాంగ్రెస్ నాయకులు
ఎల్లారెడ్డిపేట నవంబర్ 11 (జనంసాక్షి) ఎల్లారెడ్డిపేట మండలంలోని గొల్లపల్లి గ్రామానికి చెందిన పందిర్ల నారాయణగౌడ్ కరీంనగర్ ఉమ్మడి జిల్లాల కార్యదర్శిగా ఎన్నిక కాగా ఆయనను ఆదివారం మండల, జిల్లా కాంగ్రెస్‌నాయకులు ఘణంగాసన్మానించారు. ఈ సందర్బంగా మండల కాంగ్రెస్ అద్యక్షుడు నర్సయ్య మాట్లాడుతూ నారాయణగౌడ్ కాంగ్రెస్‌పార్టీ అబివృద్ది కొరకు విశేష కృషి చేయాలన్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపుకోసం ఓ సైనికుడిలా పనిచేస్తూ అందరిని చైతన్యవంతులను చేస్తూ కాంగ్రెస్ అబివృద్దికి పాటుపడాలని సూచించారు. ఈ సన్మాన కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా ప్రదాన కార్యదర్శి బండారి బాల్‌రెడ్డి, ఉపాద్యక్షుడు షేక్ గౌస్, అదికార ప్రతినిది బుగ్గ కృష్ణమూర్తిశర్మ, బ్లాక్ కాంగ్రెస్ అద్యక్షుడు సద్ది లక్ష్మారెడ్డి, పందర్లి లింగాగౌడ్, సుడిది రాజేందర్, బానోతు రాజునాయక్, శ్రీనివాస్, నాగరాజు, గిరిదర్, వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.