ఉమ్మడి జిల్లాలో ఊపందుకున్న గులాబీ ప్రచారం
జోరుగా ప్రచారం చేస్తున్న అభ్యర్థులు
కరీంనగర్,నవంబర్17(జనంసాక్షి): ఉమ్మడి జిల్లాలో టీఆర్‌ఎస్ ప్రచారం ఊరూవాడా ఉధృతంగా సాగుతోంది. జిల్లా వ్యాప్తంగా టీఆర్‌ఎస్ అభ్యర్థుల ప్రచారం ఊపందుకున్నది. ఓ వైపు మంత్రి ఈటెల రాజేందర్ ప్రచారంలో దూసుకుని పోతున్నారు. జిల్లావ్యాప్తంగా నామినేషన్ల ¬రుతోపాటు ప్రచార జోరు కనిపించింది. ఆయా నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులు ఇంటింటికీ తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు. కారుగుర్తుకే ఓటేసి, టీఆర్‌ఎస్‌కు మళ్లీ పట్టంకట్టాలని ప్రజలను కోరారు. ఇంటింటా ప్రచారం చేస్తున్న అభ్యర్థులకు జనం నీరాజనాలు పడుతున్నారు. నేతలకు మద్దతుగా చేపడుతున్న ర్యాలీలతో వాడలన్నీ గులాబీమయమవుతున్నాయి. కరీంనగర్‌తో పాటు రూరల్ మండలంలో గంగుల కమలాకర్ విస్తృత ప్రచారం నిర్వహించగా, రసమయి బాలకిషన్‌కు మద్దతుగా తిమ్మాపూర్‌లో టీఆర్‌ఎస్ నాయకులు ఇంటింటా తిరుగుతూ ఓటు అభ్యర్థించారు. కరీంనగర్ అభ్యర్థి గంగుల కమలాకర్ విస్తృతంగా పర్యటించారు. గ్రామాల్లో ఇంటింటా ప్రచారం సందర్భంగా మహిళలు బతుకమ్మలు, కోలాటాలతో స్వాగతం పలుకుతున్నారు.
జడ్పీ అధ్యక్షురాలు తుల ఉమ ఆధ్వర్యంలో టీఆర్‌ఎస్ మహిళా విభాగం నిర్వహించిన మరో ఆశీర్వాద సభలోనూ పాల్గొని తనను అధిక మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. మంత్రికి మద్దతుగా హుజూరాబాద్ పట్టణంలో బీసీ జాగృతి, ఎంబీసీ సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర నాయకులు ఇంటింటా ప్రచారం నిర్వహించారు. టీఆర్‌ఎస్ హుజూరాబాద్ మండల నాయకులు రాంపూర్ గ్రామంలో ఇంటింటా ప్రచారం చేపట్టారు. మానకొండూర్ అభ్యర్థి రసమయి బాలకిషన్‌కు మద్దతుగా తిమ్మాపూర్‌లో నాయకులు ఇంటింటా ప్రచారం చేశారు. హుస్నాబాద్‌లోని తిరుమల గార్డెన్‌లో అభ్యర్థి సతీశ్‌కుమార్‌కు మద్దతుగా గిరిజనులు ఆశీర్వాద సభ నిర్వహించారు. గత పాలకుల హయాంలో బొందల గడ్డగా మారిన కరీంనగరాన్ని గత నాలుగేళ్లుగా క్రమక్రమంగా అభివృద్ది చేసుకుంటూ వస్తున్నామన్నారు. ఈ అభివృద్ది మరింత వేగంగా, నిరంతరాయంగా సాగాలంటే మరోసారి ప్రజలు టీఆర్‌ఎస్‌కు అండగా నిలవాలని కోరారు.