ఉమ్మడి జిల్లా పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయాలి:

 సిపిఐ జిల్లా కార్యదర్శి విజయరాములు.

వనపర్తి టౌన్ ఆగస్టు  (జనం సాక్షి) ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులు వెంటనే పూర్తి చేయాలని సిపిఐ జిల్లా మహాసభలలో తీర్మానించినట్లు జిల్లా కార్యదర్శి కే విజయరాములు తెలిపారు సోమవారం జిల్లాలోని సిపిఐ కార్యాలయంలో సాయంత్రం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో తీర్మానాల వివరాలను వెల్లడించారు భీమా సంఘం బండ బూత్పూరు నెట్టెంపాడు కల్వకుర్తి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టులు అసంపూర్తిగా ఉన్నాయని వెంటనే పూర్తి చేయాలని తెలిపారు జిల్లాలో ఖనిజ సంపద అపారంగా ఉందని చిన్న మధ్య తరహా భారీ నేను పరిశ్రమలను ఏర్పాటు చేసి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని తెలిపారు తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే సాంస్కృతిక కళాశాలలో జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయాలని కోరారు పేద ప్రజలకు మెరుగైన వైద్యం కోసం జిల్లా కేంద్రంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని మండల కేంద్రాల్లో ఆసుపత్రులను ఏర్పాటు చేయాలని తీర్మానించినట్లు తెలిపారు జిల్లా కేంద్రం మున్సిపాలిటీలు గ్రామ పంచాయతీల పరిధిలోని మిగులు భూమిని పేదలకు ఇళ్ల స్థలాల పట్టాలు ఇవ్వాలని తెలిపారు జిల్లాలో చెరుకు పండించే ప్రాంతంలో టన్నుకు 4000 రూపాయలు ఇవ్వాలని గిట్టుబాటు ధర కల్పించాలని ట్రాన్స్పోర్ట్ కట్టింగ్ చార్జీలు కంపెనీలే భరించాలని తీర్మానించినట్లు వెల్లడించారు బీడీ కార్మికులు బిల్డింగ్ ఆశ అంగన్వాడి మిడ్ డే మీల్స్ షాపింగ్ వర్కర్స్ సమస్యలను పరిష్కరించాలని కోరారు ఉపాధి హామీ పని సంవత్సరం పొడుగునా కొనసాగించాలని రోజుకూలి రూపాయలు 500 ఇవ్వాలని కూలీలను వారంలోగా చెల్లించాలని తీర్మానించినట్లు తెలిపారు తద్వారా వలసలను నివారించాలని డిమాండ్ చేశారు జిల్లా కార్యవర్గ సభ్యులు పి కళావతమ్మ మోష శ్రీరామ్ వనపర్తి పట్టణ కార్యదర్శి రమేష్ పాల్గొన్నారు.జిల్లా కార్యదర్శిగా కె విజయ రాములు రెండోసారి ఎన్నిక.వనపర్తి జిల్లా కేంద్రంలో ఆగస్టు 6, 7 తేదీలలో జరిగిన జిల్లా మహాసభలలో నూతన కార్యదర్శిగా కె విజయ రాములు ఎన్నికయ్యారు ఆయన కార్యదర్శి కావటం ఇది రెండోసారి ఆయన అమరచింత మూడో వార్డు కౌన్సిలర్ గా ఉన్నారు జిల్లా కార్యదర్శిగా ఎన్నికైన కార్యదర్శికి జిల్లా కార్యవర్గ సభ్యులు కళావతమ్మ శ్రీరామ్ మోష రమేష్ తదితరులు శుభాకాంక్షలు తెలియజేశారు