ఉమ్మడి మెదక్ జిల్లాకు రెండు అసెంబ్లీ స్థానాలు 1ఎంపీ స్థానం కేటాహించాలి
తెలంగాణ రాష్ట్ర యువత అధ్యక్షులు అల్లుడు జగన్ ముదిరాజ్
సంగారెడ్డి బ్యూరో , జనం సాక్షి , ఆగస్టు 19 :
ఉమ్మడి మెదక్ జిల్లాకు రెండు అసెంబ్లీ స్థానాలు 1ఎంపీ స్థానం కేటాహించాలని తెలంగాణ రాష్ట్ర యువత అధ్యక్షులు అల్లుడు జగన్ ముదిరాజ్ డిమాండ్ చేశారు.
శనివారం రోజు సంగారెడ్డి జిల్లా ముదిరాజ్ మహాసభ కార్యాలయంలొ ఈ నెల 25 న హైదరాబాద్ లోని బేగంపేట్ పైగా ప్యాలెస్ జరిగే ముదిరాజ్ ప్లినరి సందర్బంగా వాల్ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమానికి ముదిరాజ్ మహాసభ యువత విభాగం అధ్యక్షులు అల్లుడు జగన్ ముదిరాజ్ విచ్చేసి జిల్లా అధ్యక్షులు పులిమామిడి రాజు ఆధ్వర్యంలో ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా అల్లుడు జగన్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట జనాభాలొ 12శాతం ఉన్న ముదిరాజ్ కులానికి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని అందులో భాగంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో రెండు అసెంబ్లీ స్థానాలు 1ఎంపీ స్థానం కేటాయించాలని దాదాపు ఉమ్మడి మెదక్ జిల్లాలో ప్రతి నియోజకవర్గానికి 50000నుండి 100000 జనాభా ఉన్నారని వచ్చే ఎన్నికల్లో మా ముదిరాజ్లకు ఏ పార్టీలైతే రాజకీయంగా అవకాశం కల్పిస్తే వారికీ మా ముదిరాజ్ల మద్దత్తు ఉంటుందని డిమాండ్ చేశారు.
అనంతరం జిల్లా అధ్యక్షుడు పులిమామిడి రాజు మాట్లాడుతూ జిల్లాలో అధిక శాతం జనాభా ఉన్న ముదిరాజులకు పార్టీలు సముచిత స్థానం కల్పించాలని కోరారు . ముదిరాజులు సామాజికంగా, ఆర్థికంగా ఎదగాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు . ముదిరాజుల ఓట్లతో గద్దనెక్కుతున్న నాయకులు వారిని మరవకూడదన్నారు . రానున్న రోజుల్లో ముదిరాజులు సత్తాను చూపించాల్సిన అవసరం ఉందన్నారు .
ఇట్టి కార్యక్రమంలొ ముదిరాజ్ మహాసభ మహిళా విభాగం అధ్యక్షురాలు మందుల వరలక్ష్మి , రాష్ట్ర ఉపాధ్యక్షులు మాసన్పల్లి నారాయణ , జిల్లా ముదిరాజ్ మహాసభ నాయకులు కొత్లాపూర్ శ్రీనివాస్ , సుధాకర్ చెంద్రశేఖర్ పోతిరెడ్డిపల్లిx సర్పంచ్ సుమంగళి చెంద్రశేఖర్, సంగారెడ్డి మండల కన్వీనర్ యాదగిరి కొండాపూర్ మండల కన్వీనర్ ప్రభాకర్ గారు వివిధ గ్రామాల ముదిరాజ్ సంఘల నాయకులు PMR యువసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు.