ఉరిశిక్ష లేదు: రాజీవ్ గాంధీ హత్య కేసుపై సుప్రీం కోర్టు

cvpdxeas copyన్యూఢిల్లీ: భారత మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ హత్య కేసులోని హంతకులకు ఉరి శిక్ష విధించడం సాధ్యం కాదని,వారికి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తున్నామని బుధవారం సుప్రీం కోర్టు అత్యున్నత ధర్మాసనం స్పష్టం చేసింది. రాజీవ్ గాంధీని హత్య చేసిన వారికి ఉరి శిక్ష విధించకుండా యావజ్జీవ శిక్ష ను విధించడాన్ని ప్రశ్నిస్తు, శిక్ష అనుభవిస్తున్న వారిని ముందుగానే విడుదల చెయ్యాలని సమర్పించిన అర్జీలను బుధవారం సుప్రీం కోర్టు కొట్టివేసింది.  మాజీ ప్రధాని రాజీవ్ గాంధీని హత్య చెయ్యడానికి విదేశీయుల సహాయం తీసుకున్నారని, అలాంటి వారిని క్షమించరాదని, వారికి శిక్ష పూర్తి కాకుండానే విడిచి పెట్టడం మంచిది కాదని కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టు లో అర్జీ సమర్పించింది.  ఈ అర్జీని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి హెచ్.ఎల్. దత్తు, న్యాయమూర్తి ఫకీర్ మహమ్మద్ ఇబ్రహీం కాలివుల్లా, జస్టిస్ పినాకి చంద్ర ఘోష్, జస్టిస్ అభయ్ మనోహర్, జస్టిస్ ఉదయ్ ఉమేష్ నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం విచారించి ఈ తీర్పు చెప్పింది. రాజీవ్ గాంధీ హత్య కేసులో నళిని శ్రీహరన్, సంతన్, మురుగన్, పేరారి వేలన్ లకు గతంలో ఉరి శిక్షను రద్దు చేసిన సుప్రీం కోర్టు వారికి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. నళిని తనను శిక్షకు ముందే విడిచి పెట్టాలని సమర్పించిన అర్జీని సుప్రీం కోర్టు కొట్టివేసింది. వీరందరూ 1991 నుండి తమిళనాడులోని వేలూరు సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. రాజీవ్ గాంధీ హత్య కేసులో మిగిలిన ముగ్గురు శ్రీ పెరంబదూరు సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. 1991 మే 21వ తేదిన రాజీవ్ గాంధీని శ్రీ పెరంబదూరులో వీరు మానవబాంబులతో దారుణంగా హత్య చేశారు. ఇదే దాడిలో 14 మంది మరణించారు.