ఉల్లినియంత్రణ

– తెలంగాణ సర్కారు నిర్ణయం

హైదరాబాద్‌,డిసెంబరు 9 (జనంసాక్షి): రాష్ట్రంలో ఉల్లి ధరలు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. రాష్ట్రంలోని వ్యాపారుల వద్ద ఉల్లి నిల్వలపై ఆంక్షలు విధించింది. ¬ల్‌సేల్‌ వ్యాపారులు 250 క్వింటాళ్లు, రిటైల్‌ వ్యాపారులు 20 క్వింటాళ్ల వరకు ఉల్లిని నిల్వ చేసుకునేందుకు అనుమతి ఇచ్చింది. ధరల నియంత్రణలో భాగంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దిగుమతి చేసుకునే వ్యాపారులకు మినహాయింపు ఇచ్చింది. అందుకు అనుగుణంగా గతంలో జారీ చేసిన ఉల్లి వ్యాపారుల అనుమతులు, నిల్వ, నియంత్రణ ఉత్తర్వులకు ప్రభుత్వం సవరణ చేస్తూ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.