ఉస్మాన్ సాగర్‌కు వరదపోటు
రెండు గేట్లు ఎత్తి మూసికి విడుదల
హైదరాబాద్,జూలై11(జనం సాక్షి ): ఉస్మాన్ సాగర్ జలాశయంలోకి వరద ఉధృతి కొనసాగుతోంది. ఉస్మాన్ సాగర్‌కు 300 క్యూసెక్కుల ఇన్‌ప్లో వస్తోంది. ఉస్మాన్ సాగర్ నుంచి రెండు గేట్ల ద్వారా మూసిలోకి నీరు వెళుతోంది. ఉస్మాన్ సాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం 1790 అడుగులు కాగా.. ప్రస్తుత నీటి మట్టం 1786 అడుగులకు చేరుకుంది. హిమాయత్ సాగర్‌కు వస్తున్న 500 క్యూసెక్కుల ఇన్‌ఎª`లో వచ్చి చేరింది. హిమాయత్ సాగర్ రెండు గేట్ల ద్వారా 686 క్యూసెక్కుల నీరు మూసిలోకి వెళుతోంది. హిమాయత్ సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 1763.50 అడుగులు కాగా.. ప్రస్తుత నీటి మట్టం 1760.55 అడుగులకు చేరింది.