ఋషీ పంచమి వేడుకల్లో బలరాం జాదవ్

బజార్ హత్నూర్ (జనం సాక్షి ) : బజార్ హత్నూర్ మండలం టెంబి మంజీరాం తాండ లో ఏర్పాటు చేసిన ఋషీ పంచమి వేడుకలకు శ్రీ సంత్ దర్యావ్ సింగ్ మహారాజ్ గ్రామస్తుల ఆహ్వానం మేరకు‌ తెలంగాణ రాష్ట్ర అధ్యాపకుల సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ హాజరై దర్యావ్ సింగ్ మహారాజ్ గారి ఆశీర్వాదం తీసుకున్నారు ఈ సందర్భంగా బలరాం మాట్లాడుతూ మథుర సమాజ ఆరాధ్య దైవం అయిన శ్రీ సంత్ కాళుబాబా దేవిగా కొలిచే జ్వాలాముఖి దేవి యొక్క ఆలయం ముందు దేశం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చి తమ సాంప్రదాయ నృత్యాలు చేస్తూ భక్తిభావంలో పరవశించి పోతారు అని అన్నారు అనంతరం వచ్చిన భక్తులందరికీ అన్నదానం ఏర్పాటు చేశారు ఇలాంటి బృహత్తర కార్యక్రమానికి ఆహ్వానించి నందుకు మహారాజ్ కు గ్రామస్తులకు మథుర సమాజ భక్తులకు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపిపి జయశ్రీ కేవల్ సింగ్ వైస్ ఎంపిపి పోరెడ్డి శ్రీనివాస్ ఎంపిటిసి గజానంద్ పిఏసిఎస్ డైరెక్టర్ వినీల్ కుమార్ పెరుగు సంతోష్ గాజుల రాకేష్ హీరా సింగ్ బత్తిని సుధాకర్ శ్రీకాంత్ జ్ఞానేశ్వర్ గణేష్ సంతోష్ సింగ్,గ్రామస్తులు భక్తులు తదితరులు పాల్గొన్నారు