ఎంజీఎంలో మరో శిశువు మృతి
వరంగల్: ఎంజీఎంలో శిశువుల మరణాలు కొనసాగుతున్నాయి. ఆసుపత్రిలో అనారోగ్యంతో 3 రోజుల పసికందు శుక్రవారం ఉదయం మృతి చెందింది, రెండు రోజుల వ్యవధిలో ఈ ఆసుపత్రిలో నలుగురు శిశువులు ప్రాణాలు కోల్పోవడవంతో తల్లిదండ్రులు, బంధువులు ఆందోళనకు దిగారు.