ఎంపి కార్యాలయంలో క్రెడిట్ క్యాంప్
వినుకొండ, జూలై 18 : మండల పరిషత్ కార్యాలయంలో క్రెడిట్ క్యాంప్ నిర్వహిస్తున్నామని బొల్లాపల్లి ఎంపిడిఓ అశోక్‌బాబు తెలిపారు. బుధవారంనాడు జరిగిన క్రెడిట్ క్యాంప్ కార్యక్రమానికి మండల ప్రత్యేక అధికారి, పశువర్దక శాఖ డిబి వెంకటేశ్వర్లు హాజరయ్యారు. రాజీవ్ యువశక్తి పథకం కింద మండలానికి పది యూనిట్లు మంజూరయ్యాయని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీ వికలాంగులు రుణాలు పొందేందుకు క్రెడిట్ క్యాంప్ ఎంతో దోహదకారి అవుతుందని అన్నారు. ఈ క్యాంప్‌ను వికలాంగులు సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. ఎస్బిఐ, ఎస్‌బిహెచ్, కెనరాబ్యాంకు, అగ్రికల్చరల్ బ్యాంకు అధికారులు క్రెడిట్ క్యాంప్‌కు హాజరయ్యారు.