ఎంపీ పదవికి బాల్కసుమన్‌ రాజీనామా

– రాజీనామా లేఖను స్పీకర్‌ సుమిత్రా మహజన్‌కు అందజేత
హైదరాబాద్‌, డిసెంబర్‌17(జ‌నంసాక్షి) : ఎంపీ పదవికి ఎమ్మెల్యే బాల్‌ సుమన్‌ రాజీనామా చేశారు. రాజీనామా లేఖను సోమవారం లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌కు ఆయన అందించారు. ఎంపీగా ఉన్న సుమన్‌ను ఈ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ రేసులో నిలిపింది. పెద్దపల్లి జిల్లా చెన్నూరు సిట్టింగ్‌ ఎమ్మెల్యే నల్లాల ఓదేలును కాదని సీఎం కేసీఆర్‌ సుమన్‌కు ఆ నియోజకవర్గ టికెట్‌ ఇచ్చారు. అయితే మహాకూటమి అభ్యర్ధి బోర్లకుంట వెంకటేష్‌పై 26,849 ఓట్ల మెజార్టీతో సుమన్‌ విజయం సాధించారు. అంతేకాదు కేసీఆర్‌ మంత్రివర్గంలో సుమన్‌కు అవకాశం ఉందనే ఉహాగానాలు వినిపిస్తున్నాయి. మంత్రి పదవి ఇవ్వాలనే ఉద్దేశంతోనే సుమన్‌ను అసెంబ్లీ బరిలో దింపారనే ప్రచారం కూడా జరుగుతోంది. సుమన్‌తో పాటు మల్కాజ్‌గిరి ఎంపీ చామకూర మల్లారెడ్డి కూడా ఈ అసెంబ్లీలో ఎన్నికల్లో మేడ్చల్‌ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. మల్లారెడ్డి 87,990 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. మల్లారెడ్డికి కేబినెట్‌ ¬దా ఖామయని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.