ఎక్సైజ్‌ వాహనం ధ్వంసం : ఉద్రిక్తత

విజయవాడ, జూలై 19: ఆగిరిపల్లి మండలం కొమ్మూరులో సారాబట్టీల ధ్వంసానికి వచ్చిన ఎక్సైజ్‌ అధికారులపై దాడి జరిగింది. వారి వాహనాన్ని ధ్వంసం చేశారు. దీంతో నూజివీడు నుండి అదనపు పోలీసు బలగాలను రప్పించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ గ్రామంలో నాటుసారా విచ్చలవిడిగా తయారవుతుందని, అక్కడ కుటీర పరిశ్రమగా వర్దిల్లుతుందని అందిన సమాచారం మేరకు ఎక్సైజ్‌ పోలీసులు గురువారం దాడులకు వెళ్లారు. సుమారు 30 బట్టీలను గుర్తించి వాటిని ధ్వంసం చేశారు. దాదాపు వందలీటర్ల సారాను పారపోశారు. ఈ దశలో సారా తయారీదారులు అధఙకారులపై దాడికి దిగారు. అక్కడే ఉన్న ప్రభుత్వ వాహనాన్ని వారు పగులగొట్టారు. ఇంతలో పోలీసులు అధిక సంఖ్యలో తరలివచ్చి పరిస్థితిని అదుపు చేశారు. దాడులకు పాల్పడిన 11 మందిని అదుపులోకి తీసుకున్నారు.