ఎద్దులగూడెంలో నిరుపయోగంగా ఉన్న వంటగది

మల్దకల్ ఆగస్టు 9 (జనంసాక్షి) మండల పరిధిలోని ఎద్దులగూడెంప్రాథమిక పాఠశాలలో వంటగది  నిరుపయోగంగా ఉన్నది. మండల కేంద్రానికి కిలోమీటర్ దూరంలో ఉన్న ఈ గ్రామంలో విద్యార్థులు30 మంది విద్యార్థుల కంటే తక్కువనే ఉన్నారు. విద్యార్థుల మధ్యాహ్నం భోజనము వంట ఏజెన్సీ వారు పాఠశాల వంటగదిల్లో వండకుండగా ఇంటిదగ్గర మధ్యాహ్నం భోజనము వండుకొని వచ్చి విద్యార్థులకు పెడుతున్నారు. ప్రభుత్వం వేలాది రూపాయలతో వంటగదులు నిర్మిస్తుంటే వంట గది వినియోగంలోకి తీసుకురావాల్సిన అధికారులు కూడా పట్టించుకోవడం లేదని ఆరోపణ వినిపిస్తున్నాయి. వంటగదులు లేక చాలా  పాఠశాలలో తీవ్ర ఇబ్బందులకు గురవుతుంటే మరోవైపు వంటగదులు ఉండి వంట చేయకుండా పాఠశాలలో నిరుపయోగంగా వంటగది ఉంది.ప్రభుత్వము వేలాది రూపాయలు ఖర్చుపెట్టి నిర్మిస్తుంటే వాటిని వినియోగంలోకి తేవాల్సిన అధికారులు కూడా పట్టించుకోవడంలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా విద్యాశాఖ అధికారులువెంటనే స్పందించి  వంట గదిలో మధ్యాహ్న భోజనము పాఠశాలలోని వండే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.