ఎన్నికల్లోటీబీజీకేఎస్‌ను ఆదరించండి
భూపాలపల్లి, మే 25, (జనంసాక్షి) : తెలంగాణ సిరుల తల్లి సింగరేణిని గుర్తింపు సంఘాలుగా గెలిచిన ఏఐటియుసి, ఐఎన్‌టియుసిలు కలిసి నిర్వీర్యం చేశాయని టిబిజికెఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కెంగర్ల మల్లయ్య ఆరోపించారు. శుక్రవారం స్థానిక కాకతీయ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో జాతీ య సంఘాలకు గుణపాఠం చెప్పి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం అవిశ్రాంతంగా పోరాటం చేస్తున్న టిబిజికెఎస్‌ను గెలిపించుకోవాలని కోరారు. టిబిజికెఎస్ పట్ల కార్మికులు చూపిస్తున్న ఆదరణను ఓర్వ లేక జాతీయ సంఘాల నాయకులు పనికట్టుకొని దిగజారి ఆరోపణలు చేస్తూ ఎన్నికల ముందే వారి ఓటమిని అంగీకరిస్తున్నారని పేర్కొన్నారు. ఏఐటియుసి నేత సీతారామయ్య సింగరేణి కార్మికులకు సిఎంపిఎఫ్ వడ్డీరేటు, పెన్షన్‌ను తగ్గించారని చేస్తున్న ఆరోపణల్లో ఎటువంటి నిజం లేదని స్పష్టం చేశా రు. సింగరేణిలో వివిధ విభాగాలు ప్రైవేటుపరం అయితే నోరు మొదపలేదని, చివరకు కెటికె8 లాంగ్ వాల్ ప్రాజెక్టును పూర్తిగా ఇందూ కంపెనీకి అప్పగిస్తే కనీసం అడ్డుకోలేదని విమర్శించార శ్రీరాంపూర్‌లో జరిగిన ఏఐటియుసి మహాసభలో పార్లమెంటరీ నాయకుడు గురుదాస్‌గుప్తా స్వయంగా ఓపెన్‌కాస్టులకు అనుకూలంగా తీర్మాణం చేశారని, అంటే ఈ ప్రాంతం అంతా బొందల గడ్డగా మారిన పట్టించుకోరా అని సూటిగా ప్రశ్నించారు., గుర్తింపు సంఘంగా టిబిజికెఎస్‌ను గెలిపిస్తే వార సత్వ ఉద్యోగాలను తిరిగి సాధించిపెట్టి ఇక్కడి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలను కల్పిస్తామని హామి ఇచ్చారు. సమ్మె కాలంలో బొగ్గు ఉత్పత్తికి సహకరించిన తొత్తు సంఘాలను చిత్తుగా ఓడించాలని కార్మి కులకు పిలుపునిచ్చారు. సెంట్రల్ లేబర్ కమీషనర్ సింగరేణి ఎన్నికలను నిర్వహిస్తున్నదని చట్టబద్దంగా జరుగుతున్న ఈ ఎన్నికల ద్వారా చట్టం ద్వారానే వేజ్‌బోర్డులో 6వ వేజ్‌బోర్డు సంఘంగా అవత రిస్తామని మల్లయ్య స్పష్టం చేశారు. ఈ సమావేశంలో మండ సంపత్, చందర్‌రావు, మనోజ్ కుమార్, లక్ష్మణ్, యాదగిరి, సాయిలు, శ్రీనివాస్, కిషన్‌రెడ్డి, నారాయణ తదితరులు పాల్గొన్నారు.