ఎన్నికల ప్రచారానికి శ్రీకారం

సంగారెడ్డి,సెప్టెంబర్‌26(జ‌నంసాక్షి): పటాన్‌ చెరు నియోజవర్గం టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి గూడెం మహిపాల్‌ రెడ్డి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. రుద్రారం గణెళిష్‌ ఆలయంలో ఎన్నికల ప్రచార రథాలకు పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గూడెం మహిపాల్‌ రెడ్డితో పాటు, ఎంపీ కొత్త ప్రభాకర్‌ రెడ్డి, ఎమ్మెల్సీ భూపాల్‌ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం గుమ్మడిదల మండలంలోని కొత్తపల్లి గ్రామం నుంచి
ఎన్నికల ప్రచారం ప్రారంభించారు.