ఎన్నికల హావిూల అమలు అతిపెద్ద బాధ్యత

ఆదాయం పెంచుకుంటేనే ఆచరణ సాధ్యం
హైదరాబాద్‌,డిసెంబర్‌19(జ‌నంసాక్షి): ఎన్నికల్లో ఇచ్చిన హావిూల అమలుకు సిఎం కెసిఆర్‌ ఇప్పుడు దృష్టి సారించాల్సి ఉంది. ఒక్కో పథకంపై దృష్టి పెట్టిన కెసిఆర్‌ ఆదాయవనరులపైనా శ్రద్ద పెట్టాలి. తెలంగాణ అన్ని రాష్ట్రాలకన్నా ప్రత్యేకం అన్న రీతిలో అభివృద్ది చేసేందుకు చేస్తున్న కృషి ఫలిస్తున్న వేళ..ఆదాయం కూడా అంతే మోతాదులో రావాల్సి ఉంది. కొన్ని సంక్షేమ పథకాలు గుదిబండగా ఉన్నవాటిని సవిూక్షించుకోవాల్సి ఉంది. దేశ వ్యవసాయ రంగానికే తెలంగాణను ఆదర్శంగా నిలిపేందుకు ముఖ్యమంత్రి  కెసిఆర్‌ అలుపెరుగక ముందుకు వెళుతున్నారు. తెలంగాణలో ఇప్పటికే అనేక రైతు సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయి. ఇవన్నీ కూడా ఆచరణలో ఉన్నాయి. ఒక్కో పథకాన్ని పట్టాలకెక్కించి ముందుకు సాగుతున్నారు. స్వయంగా రైతు అయిన కేసీఆర్‌.. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నాటినుంచి వ్యవసాయరంగంలో ఇబ్బందులను ఒక్కొక్కటిగా పరిష్కరించడంపై దృష్టి పెట్టారు. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ రూ.17వేల కోట్ల రుణమాఫీతో తమది రైతు పక్షపాత ప్రభుత్వమని నిరూపించారు. మరోమారు ఇప్పుడు ఆ బాధ్యతను ఆయన ముందుకు తీసుకుని వెళ్లాల్సి ఉంది. ఎన్నికల్లో ఇచ్చిన హావిూల బాధ్యత తక్కువేవిూ కాదు. మరోమారు రుణమాఫీకి పూనుకోవాలి. రైతుపెట్టుబడి 5వేలకు పెంచుకోవాలి. పెన్షన్లను రెట్టింపు చేస్తామని హావిూ ఇచ్చారు. ఇవన్నీ పూర్తి కావాలంటే ఆదాయం పెరగాల్సి ఉంది. ఇందుకు ఇప్పటి నుంచే ప్రణాళికలు రూపొందించుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఓ వైపు రైతు
అవసరాలు ఎరిగి.. ప్రణాళికాబద్ధంగా వ్యవసాయరంగాన్ని ముందుకు తీసుకెళుతున్నారు. అవస్థలపాలు చేసిన కరంటు కష్టాలు మూడేండ్లలో పూర్తిగా మటుమాయమయ్యాయి. సాగుకు ఏమాత్రం ఇబ్బందులు లేకుండా సాఫీగా సాగేలా ఒక్కటొక్కటిగా సాగునీటి ప్రాజెక్టులు అందుబాటులోకి వస్తున్నాయి. ఓవైపు పెట్టుబడికి చేయూత, మరోవైపు గిట్టుబాటు ధర వచ్చేలా రైతుసంఘాల ఏర్పాటుతో ఏండ్ల తరబడి బీళ్లయిన భూములను ఆకుపచ్చగా మార్చడంలో కేసీఆర్‌ అనుసరించిన వ్యూహాలు, అన్నదాతలకు అండగా నిలుస్తున్న తీరు ఆశ్చర్యం గొలుపుతున్నాయి. రైతుల్లో ఆనందోత్సాహాలు వ్యక్తమవుతున్నాయి. ఎకరానికి రూ.4వేల పెట్టుబడి నిర్ణయంతో సీఎం కేసీఆర్‌ దేశ వ్యవసాయరంగంలోనే సరికొత్త అధ్యాయానికి తెరతీశారు.  స్వరాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత తెలంగాణ సర్కార్‌ వ్యవసాయ రంగం కోసం తీసుకున్న చర్యలకు సర్వత్రా హర్షామోదాలు లభిస్తున్నాయి. సాగులో రైతులకు సలహాలు, సూచనలు అందించేలా క్షేత్రస్థాయిలో వ్యవసాయ, ఉద్యాన శాఖలను బలోపేతం చేసేలా ప్రభుత్వం భారీగా నియామకాలు చేపట్టింది. ప్రతి 5వేల ఎకరాలకు ఒక ఏఈవో ఉండేలా ఏఈవో పోస్టులను భర్తీ చేసింది.  2009 నుంచి రైతులకు చెల్లించాల్సిన ఇన్‌పుట్‌ సబ్సిడీ పాత బకాయిలను తెలంగాణ ప్రభుత్వం వచ్చిన వెంటనే..  బ్యాంకుల ద్వారా చెల్లించింది. తెలంగాణ రాష్ట్ర సూక్ష్మనీటి సేద్య పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీ రైతులకు 100శాతం రాయితీ.. చిన్న, సన్నకారు రైతులకు 90శాతం సబ్సిడీ.. ఇతరులకు 80శాతం సబ్సిడీపై డ్రిప్‌ సదుపాయం కల్పిస్తున్నది. గతంలో ఈ పథకంలో గరిష్ఠంగా ఒక ఎకరాకు రూ.లక్ష మాత్రమే సబ్సిడీగా లభించేంది. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్‌ సబ్సిడీ మొత్తాన్ని గరిష్ఠంగా రూ.6లక్షలకు పెంచారు. కూరగాయల విత్తనాలకు ప్రభుత్వం 50 శాతం రాయితీ ఇస్తున్నది. క్రాప్‌ కాలనీలను గుర్తించి రాష్ట్రాన్ని పండ్లు, పూలు, కూరగాయల సాగులో స్వయంసమృద్ధి సాధించేలా ప్రణాళికలు రూపొందించింది. పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లోనూ చంద్రబాబునాయుడు సర్కార్‌ రుణమాఫీ హావిూ ఇచ్చినా అక్కడ సక్రమంగా అమలు చేయలేకపోయారు. ఈ దశలో వివిధ రంగాలపై సవిూక్షించి ఆదాయవనరులను పెంచుకోవాల్సిన అవసరం కూడా ఉంది.