ఎన్‌ఎంఎంఎస్‌కు గుండెపుడి విద్యార్థి

మర్రిపెడ రూరల్‌: ఎన్‌ఎంఎంఎస్‌కు మండలంలోని గుండెపుడి ప్రభుత్వ పాఠశాలకు చెందిన ఓర రాజకుమార్‌ ఎంపికైనట్లు ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయులు చిట్యాల రమేష్‌బాబు బుధవారం ఒక పత్రిక ప్రకటనలో తెలిపారు. ఏడాదికి రూ.6వేలు చొప్పున రెడేళ్లపాటు ఆ విద్యార్థికి ఎన్‌ఎంఎంఎస్‌ నుంచి స్కాలర్‌షిప్‌ వస్తుందని ఆయన తెలిపారు. స్కాలర్‌షిప్‌నకు అర్హత పొందిన రాజకుమార్‌ను ఉపాధ్యాయులు అభినందించారు.