ఎన్‌ఎంయూతోనే సమస్యల పరిష్కారం
సంగారెడ్డి అర్బన్: ఆర్టీసీ కార్మీకుల సమస్యల పరిష్కారం కేవలం ఎన్‌ఎంయూతోనే సాద్యమవుతుదని ఆ సంఘం జోనల్ కార్యదర్శి జీవ రెడ్డి స్పష్టం చేశారు.సోమవారం స్థానిక కెమిస్ట్ భవనంలో జిల్లా సమీక్ష సమావేశం నిర్వహించారు.ఎంఈ ,టీఎంయూ యాజమాన్యంతో కుమ్మక్కై కార్మికుల సమస్యలను విస్మరిస్తున్నాయని అరోపించారు.
కార్మికుల సమస్యల సాధన కోసం ఈ నెల 21 న విధి నిర్వహణలో ఎర్రబ్యాడ్జీలు దరించి డిపో మెనెజర్ కార్యలయాల వద్ద నిరసనలు చేపట్టాలని పిలుపునిచ్చారు.అనంతరం డిమాండ్ల కరపత్రాన్ని అవిష్కరించారు. సమావేశంలో ప్రాంతీయ అద్యక్షుడు బట్టి భూపతి,నాయకులు అప్సర్‌పాషా.ఎస్.ఎస్.రావు,మౌలాన.కె. సత్తయ్య,ఎక్బాల్,పల్లెకృష్ణమూర్తి,అంజయ్య, కృష్ణారెడ్డి పాల్గోన్నారు.