ఎన్‌ఐఏ చీఫ్‌గా యోగేశ్‌ చందర్‌ బాధ్యతల స్వీకరణ

న్యూఢిల్లీ,అక్టోబర్‌30(జ‌నంసాక్షి) : జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) డైరక్టర్‌ జనరల్‌గా యోగేశ్‌ చందర్‌ మోదీ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. 2021, మే 31వ తేదీ వరకు ఆయన ఆ పదవిలో కొనసాగుతారు. మాజీ చీఫ్‌ శరద్‌ కుమార్‌ స్థానంలో ఐపీఎస్‌ క్యాడర్‌కు చెందిన సీనియర్‌ ఆఫీసర్‌ యోగేశ్‌ బాధ్యతలు చేపట్టనున్నారు. 2002లో జరిగిన గోద్రా అల్లర్ల ఘటనకు సంబందించిన మూడు కేసుల్లోనూ యోగేశ్‌ మోదీ ఇన్‌ఛార్జ్‌ ఆఫీసర్‌గా వ్యవహరించారు. 1984 ఐపీఎస్‌ బ్యాచ్‌కు చెందిన యోగేశ్‌.. అస్సాం మేఘాలయా క్యాడర్‌లో పనిచేశారు. ఎన్‌ఐఏ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టకముందు ఆయన సీబీఐ స్పెషల్‌ డైరక్టర్‌గా విధులు నిర్వర్తించారు. కేంద్ర ¬ంశాఖ ఇచ్చిన ప్రతిపాదన మేరుకు కేంద్ర క్యాబినెట్‌… యోగేశ్‌ మోదీని ఎన్‌ఐఏ చీఫ్‌గా ఎంపిక చేసింది. ఉగ్రవాదంతో పాటు ఉగ్రనిధుల అంశాలపై ఎన్‌ఐఏ దర్యాప్తు చేపడుతుంది.