ఎపఎసఎల్ ల్యాబ్ దగ్ధంపై దుష్ప్రచారం ఆపండి
` సాక్ష్యాలు ఏసీబీకోర్టులో భద్రంగా ఉన్నాయి
` ఛార్జీషీట్ పూర్తయ్యాక ల్యాబ్‌లో ఎందుకుంటాయి?
` ఫోరెన్సిక్ ల్యాబ్‌లో అగ్నిప్రమాదం ఘటనపై సంస్థ డైరెక్టర్ జనరల్ శిఖా గోయల్ వివరణ
హైదరాబాద్(జనంసాక్షి): నాంపల్లిలోని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఎలాంటి డేటా నష్టపోలేదని, ఒకవేళ మావద్ద లేకపోయినా కోర్టు వద్ద ఉన్నాయని ఎఫఎసఎల్ డైరక్టర్ జనరల్ శిఖా గోయల్ తెలిపారు. అగ్ని ప్రమాద ఘటనకు సంబంధించిన వివరాలను ఆదివారం విÖడియాకు వెల్లడించారు. ఉదయం 10.08 నిమిషాలకు ఎఫఎసఎల్ లో అగ్నిప్రమాదం జరిగిందని, ఎఫఎసఎల్ ఉద్యోగి సాయికష్ణ సీఐ శ్రీనివాస్ రెడ్డికి సమాచారం అందించారని చెప్పారు. ఘటన స్థలానికి 10.30 నిమిషాలకు అగ్నిమా పక సిబ్బంది చేరుకున్నారని, 1.30 నిమిషాలకు మంటలు అదుపులోకి వచ్చాయన్నారు. మంటలు క్రమంగా ఎఫఎసఎల్ ల్యాబ్, ట్రైనింగ్ హాల్‌కు వ్యాపించాయని తెలిపారు. అనాలసిస్ డాక్యుమెంట్‌లో కొన్ని ఫైల్స్ దగ్దమయ్యాయని, వాటిని గుర్తించే పని కొనసాగుతోందన్నారు.2015 సంవత్సరంలో ఏసీబీకి సంబంధించిన కేసు 16 మెటీరియల్స్ ధ్వంసం అయ్యాయని తెలిపారు. కేసుకు సంబంధించిన మెటీరియల్స్ 2021లో ఏసీబీ కోర్టుకు పొందుపరిచామని స్పష్టం చేశారు. ఓటుకు నోటు కేసులో రిపోర్టులను ఆల్రెడీ ఏసీబీకి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ ఇచ్చిందని వెల్లడించారు. ఆధారాలు కాలిపోయినా ఏసీబీ దగ్గర ఉన్నాయని ఎఫఎసఎల్ డైరెక్టర్ షికా గోయల్ తెలిపారు. కేసు యధావిధిగా నడుస్తుందన్నారు. అలాగే 2024 సంవత్సరంలో పంజాగుట్ట పోలీసు స్టేషన్‌కి సంబంధించిన ఫోన్ ట్యాపింగ్ కేసు 136 మెటీరియల్స్ ఎఫఎసఎల్‌కి వచ్చాయి అని, మిగతా మెటీరియల్ అసిస్ట్ చేశాం అని, ప్రమాదం జరిగినప్పుడు అందులో 7 మెటీరియల్స్ కాలిపోయాయి అని శిఖా గోయల్ తెలిపారు. వీటిని రిట్రివ్ చేస్తాం అని స్పష్టం చేశారు. ప్రమాదంపై విచారణ జరుగుతుంది అని తెలిపారు. ప్రమాదంలో ఇంత వరకు ఎంత నష్టం జరిగిందన్నదానిపై స్పష్టత లేదు అని, ఈ కేసుకు సంబంధించిన విచారణ కొనసాగుతుందని ఆమె స్పష్టం చేశారు. 7 ఆధారాలు మినహా మిగతా వాటిని కోర్టుకు సమర్పించినట్లు శిఖా గోయల్ పేర్కొన్నారు. ఏదైనా కేసులకు సంబంధించిన ఆధారాలు, పరికరాలను ఎఫఎసఎల్ జాగ్రత్తగా ఉంచుతందని, డేటాను టీమ్ రిట్రీవ్ చేస్తుందని క్లారిటీ ఇచ్చారు. విÖడియా, ప్రజలు నిరాధారమైన ఆరోపణలు నమ్మవద్దని, పూర్తి విచారణ అనంతరం అన్ని వివరాలు మళ్లీ వెల్లడిస్తామని ఆమె చెప్పారు. అదేవిధంగా ఎఫఎసఎల్ లోని ఎక్కువ సదుపాయాలు సాధారణంగానే పనిచేస్తున్నాయని, నష్టం జరిగిన సదుపాయాలను త్వరలోనే అన్నీ పునరుద్ధరిస్తామని స్పష్టం చేశారు.
ల్యాబ్ అగ్నిప్రమాదంపై కేటీఆర్ అనుమానాలు
రేవంత్‌ను కేసు నుంచి తప్పించడానికే ల్యాబ్ తగులబెట్టారు: కేటీఆర్
హనుమకొండ(జనంసాక్షి): హైదరాబాద్ నాంపల్లిలోని ఫోరెన్సిక్ ల్యాబ్ (ఎఫఎసఎల్)లో అగ్ని ప్రమాదం కావాలనే చేశారని భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం హనుమకొండలో పర్యటించిన ఆయన విÖడియాతో మాట్లాడారు. ఎఫఎసఎల్ అగ్ని ప్రమాద ఘటనపై రాష్ట్రప్రజలకు ఎన్నో అనుమానాలు ఉన్నాయని, అసలు నేరస్థులు ఎవరో తేలాలంటే రిటైర్డ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.“ఓటుకు నోటు కేసు నుంచి రేవంత్‌ను తప్పించడానికే ల్యాబ్ తగులబెట్టారు. అందరూ మున్సిపల్ ఎన్నికల్లో బిజీగా ఉంటే రేవంత్‌రెడ్డి మాత్రం మురికి పనుల విÖద ఉన్నారు. కేసు చివరి దశలో ఉన్నప్పుడు అగ్ని ప్రమాదం జరగడంపై అనేక ఆరోపణలు వస్తున్నాయి. పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఇంట్లో ఈడీ సోదాలు జరిగి ఏడాదిన్నర అయినా.. కనీసం కేసు కూడా నమోదు కాలేదు. సింగరేణి కుంభకోణం బయటపెట్టినా.. కేంద్రం స్పందించటంలేదు” అని కేటీఆర్ ఆరోపించారు.
మాకు బీఆరఎస్‌పైనే అనుమానం
` కేటీఆర్ ప్రచారం వెనుక ఓటమి భయం
` ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి
హైదరాబాద్(జనంసాక్షి):బీఆరఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలపై భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. నాంపల్లి ఫోరెన్సిక్ ల్యాబ్‌లో జరిగిన అగ్నిప్రమాదాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ముడిపెట్టడం పూర్తిగా తప్పుడు ప్రచారమని అన్నారు. ఇలాంటి ఆరోపణలు ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నమని స్పష్టం చేశారు. ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా మాట్లాడటం బాధ్యతలేని రాజకీయానికి నిదర్శనమన్నారు. ఆధారాలు లేకుండా విమర్శలు చేయడం కేటీఆర్ స్థాయికి తగదని వ్యాఖ్యానించారు. ఈ ఘటన వెనుక అసలు ఎవరి పాత్ర ఉందో దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని ఎంపీ చామల సూచించారు. గతంలో ఎసఐబీ కార్యాలయంలో కీలక ఫైల్స్ ధ్వంసం జరిగిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అప్పట్లోనూ ఇలాంటి అనుమానాలే వ్యక్తమయ్యాయని తెలిపారు. ఇప్పుడు ఫోరెన్సిక్ ల్యాబ్ ఘటనను కూడా రాజకీయంగా వాడుకోవడం అనుమానాలకు తావిస్తోందన్నారు. నిజాలు బయటకు రావాలంటే స్వతంత్ర దర్యాప్తు తప్పనిసరిగా జరగాలని డిమాండ్ చేశారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఓటమి తప్పదనే భయంతోనే కేటీఆర్ ఈ విధమైన చిల్లర ప్రచారానికి పాల్పడుతున్నారని ఎంపీ చామల విమర్శించారు. ప్రజలు ఇప్పుడు నిజాన్నే నమ్ముతున్నారని, తప్పుడు ఆరోపణలను తిరస్కరిస్తున్నారని అన్నారు. అభివద్ధి, పాలన గురించి మాట్లాడే ధైర్యం లేకనే ఇలాంటి ఆరోపణలకు దిగుతున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం పారదర్శకంగా పనిచేస్తోందని స్పష్టం చేశారు. ప్రజలే తగిన సమాధానం ఇస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.


