ఎఫ్‌డీఐలపై రాజ్యసభలో నెగ్గిన ప్రభుత్వం

ఢిల్లీ : ఎఫ్‌డీలపై విపక్షాలు ఇచ్చిన తీర్మానం రాజ్యసభలో వీగిపోయింది. ఎఫ్‌డీఐలకు అనుకూలంగా 116 ఓట్లు రాగా, వ్యతిరేకంగా 95 ఓట్లు వచ్చాయి. రాజ్యసభకు మొత్తం 212 మంది సభ్యులు హాజరయ్యారు. ఎస్పీ, బీఎస్పీల ఎత్తుగడతో ప్రభుత్వం గట్టెక్కగలిగింది. బీఎస్పీ అనుకూలంగా ఓటు వేయగా, సమాజ్‌వాదీ పార్టీ ఓటింగ్‌ను బహిష్కరించింది. ఓ సభ్యుడు ఓటు వేయకుండా సభలోనే కూర్చున్నాడు. కొందరు సభ్యుల విజ్ఞప్తి మేరకు చైర్మన్‌ రెండోసారి ఓటింగ్‌: నిర్వహించారు.