ఎమ్మెల్యేను మర్యాద పూర్వకంగా కలసిన పిఆర్టియు నాయకులు.
ఇటీవల ఏకగ్రీవంగా ఎన్నికైన పిఆర్టియు తెలంగాణ అదిలాబాద్ జిల్లా అధ్యక్షులుగా ఎన్నికైన శుభ సందర్భంగా శనివారం రోజున పిఆర్టియు కార్యవర్గ సభ్యులు కలిసి బోథ్ నియోజకవర్గ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు స్వగ్రామమైన ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యేను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పిఆర్టియు అధ్యక్షుడు ఆడే నూర్ సింగ్ నాయక్ ను శాలువాతో సత్కరించారు.ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించడంలో పిఆర్టియు తెలంగాణ ముందు వరసలో ఉండాలని వారు కోరారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్ మోహన్ సింగ్ ఆడం మాణిక్ రావు జిల్లా ఉపాధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.