ఎమ్మెల్యేను విచారించిన ఏసీబీ
వరంగల్: మద్యం సిండికేట్ల వ్యవహరంలో ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యను మంగళవారం హన్మకొండలోని తమ కార్యాలయంలో ఏసీబీ ఆధికారులు ఈరోజు విచారించారు. మద్యం వ్యాపారి నున్న వెంకటరమణ నుంచి ముడుపులు తీసుకున్నారనే ఆరోపణలసపై ఏసీబీ అధికారులు ఎమ్మెల్యే వెంకటవీరయ్యను విచారణకు హజరుకావాలని కొద్దిరోజుల క్రితం నోటీసు జారీ చేశారు. ఈ మేరకు ఉదయం 10 గంటలకు ఎమ్మెల్యే వెంకలవీరయ్య హన్మకొండలోని ఏసీబీ కార్యాలయానికి వచ్చారు. మధ్యాహ్నం 12 గంటల వరకు ఆయనకు ఏసీబీ ఆధికారులు విచారించారు.