ఎమ్మెల్యే గువ్వల బాలరాజు కృషితో అచ్చంపేటలో డయాలసిస్ సెంటర్ మంజూరు

అచ్చంపేట ఆర్సీ, అక్టోబర్ 08,(జనం సాక్షి న్యూస్) : అచ్చంపేట నియోజకవర్గ పరిధిలోని ప్రజలకు వైద్య సేవలు అందించే దిశగా పట్టణంలో నూతనంగా నిర్మించిబడి ప్రారంభానికి సిద్ధంగా ఉన్న వంద పడకల ఆసుపత్రిలో అదనంగా డయాలసిస్ సెంటర్ మంజూరు చేయడం లో ప్రభుత్వ విప్ స్థానిక ఎమ్మెల్యే గువ్వల బాలరాజు కృషి చేశారు. దీనివలన నియోజకవర్గంలోని కిడ్నీ వ్యాధులతో ,డయాలసిస్ పై ఆధారపడి బ్రతుకుతున్న ఆర్థిక పరిస్థితి లేని నిరు పేద ప్రజలకు ఈ డయాలసిస్ సెంటర్ ఏర్పాటు వలన మేలు జరుగుతుంది.ఇదే అంశంపై స్థానిక ఎమ్మెల్యే గువ్వల బాలరాజు చరవాణి ద్వారా వివరణ కోరగా ఎమ్మెల్యే స్పందిస్తూ..అచ్చంపేట పట్టణంలో నూతనంగా నిర్మించిన వంద పడకల ఆసుపత్రిలో డయాలసిస్ సెంటర్ మంజూరు అయ్యిందని తెలిపారు తద్వారా బాధపడుతున్న నిరుపేద ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు.