ఎమ్మెల్యే నోట బూతు మాటలు.

అసెంబ్లీ కార్యదర్శి ఫిర్యాదు చేస్తాం.
గిరిజన సంఘం నాయకులకు ఎమ్మెల్యే క్షమాపణలు చెప్పాలని డిమాండ్.
అచ్చంపేట ఆర్సీ ,సెప్టెంబర్ 29,(జనం సాక్షి న్యూస్) :
మండల పరిధిలోని గుంపన్ పల్లి గ్రామానికి చెందిన లస్కర్ అనే యువకుడు గత నాలుగు రోజుల క్రితం విద్యుత్ షాక్ తో మృతి చెందడంతో గ్రామస్తులతో మరియు బాధిత కుటుంబ సభ్యులతో కలసి కలిసి మాజీ సర్పంచ్ రతన్ సింగ్ బుధవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి వెళ్లి బాదిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరడంతో ఆగ్రహించిన ఎమ్మెల్యే మాజీ సర్పంచ్ రతన్ సింగ్ ను బాధిత కుటుంబం పై దుర్భాషలాడటం పట్ల బంజారా గిరిజన యువసేన నాయకులు సంతోష్ నాయక్,శ్రీనివాస్ రాథోడ్, రంగాపూర్ శివ, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ప్రవర్తన తీరు పై ఆగ్రహం వ్యక్తం చేశారు.గురువారం స్థానిక ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బంజారా నేతలు మాట్లాడుతూ..ఎమ్మెల్యే గువ్వల బాలరాజు గిరిజన నేతలను నానా బూతులు తిట్టడంపై అసెంబ్లీ కార్యదర్శి కి ఫిర్యాదు చేస్తామని వెంటనే గిరిజనులకు భేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అచ్చంపేట నియోజకవర్గంలోని ప్రజలపై ఎమ్మెల్యే దాడిని తీవ్రంగా ఖండించారు.నియోజకవర్గం అభివృద్ధి పై దృష్టి పెట్టాలని ప్రజలపై దాడి చేయడం సరికాదని హితవు పలికారు.ఎక్కడినుండో వలసవచ్చి అచ్చంపేట నియోజకవర్గంలోస్థానిక ప్రజలపై గిరిజనులపై దాడులు చేస్తే సహించబోమని హెచ్చరించారు.ఎమ్మెల్యే హోదాను మరిచి ఇష్టానుసారం వ్యవహరిస్తూ అధికారాన్ని అడ్డం పెట్టుకొని పచ్చి బూతులు మాట్లాడితే ప్రజల నుండి తిరుగుబాటు తప్పదని అన్నారు.కార్యక్రమంలో గిరిజన సంఘం నేతలు దశరథం నాయక్, గోవింద్ సింగ్,రాజేందర్ నాయక్, నరసింహ, గోపి, వంశీ నాయక్, రమేష్ నాయక్ ,తదితరులు పాల్గొన్నారు.