ఎమ్మెల్యే పాదయాత్ర.

మల్కాజిగిరి.జనంసాక్షి.ఆగస్టు27.
నియోజకవర్గంలోని 9 డివిజన్ లలో మౌళిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అన్నారు. శనివారం నేరెడ్ మెట్ డివిజన్ లోని వివేకానంద పురంలో కార్పొరేటర్ మీనా ఉపేందర్ రెడ్డి తో కలిసి పర్యటించి స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు.రోడ్లు,డ్రైనేజీ, మంచినీరు,తదితర సమస్యలను స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు. సానుకూలంగా స్పందించిన ఆయన అధికారులతో చర్చించి సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు.ఈకార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు ఉపేందర్ రెడ్డి, చెన్నారెడ్డి,మహేష్,రాజు,శ్రీనివాసరెడ్డి, రమేష్ తదితరులు పాల్గొన్నారు.