ఎమ్మెల్యే మెచ్చా, ఎంపీ నామ చొరవతో మండలానికి అంబులెన్స్.
(జనం సాక్షి) 15 అక్టోబర్:
దమ్మపేట మండలానికి అంబులెన్స్ లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా తరుణంలో అశ్వారావుపేట శాసనసభ్యులు మెచ్చా నాగేశ్వరరావు ప్రత్యేక చొరవ తీసుకుని ఎంపీ నామా నాగేశ్వరరావు, జిల్లా కలెక్టర్ తో మాట్లాడి మండలానికి అంబులెన్స్ ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా ఈరోజు తాటిసుబ్బన్నగూడెంగ్రామంలో స్థానిక ప్రజా ప్రతినిదులు, నాయకులతో కలిసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఎమ్మెల్యే ,జెడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు ,మండల BRS పార్టీ అధ్యక్షులు దొడ్డకుల రాజేశ్వరరావు ,ఎంపీపీ సోయం ప్రసాద్, వైస్ ఎంపీపీ దారా మల్లికార్జున్ రావు ,ఉమ్మడి జిల్లా 108,102 మనేజర్ భూమా నాగేంద్ర , దారా యుగంధర్, దమ్మపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యురాలు మాధురి, సర్పంచ్ లు తాటి అశోక్ ,సున్నం శ్రీను ,నరసింహ రావు , దొడ్డ శ్రిరామ్ మూర్తి, రాధ కృష్ణ ,ఏళ్ళిన రాఘవరావు ,నాగేశ్వరరావు ,ఏడవెల్లి కిషోర్ ,అబ్దుల్ జిన్నా తదితరులు పాల్గొన్నారు.