ఎమ్మెల్యే సమక్షంలో కిటకిట రాజు ముదిరాజ్ జన్మదిన వేడుకలు

సైదాపూర్ జనం సాక్షి అక్టోబర్ 22(లస్మన్నపల్లి) మండలంలోని లస్మన్నపల్లి గ్రామానికి చెందిన కిటకిట రాజు ఎలియాస్ పెసరి రాజు ముదిరాజ్ జన్మదిన వేడుకలను శనివారం మునుగోడు నియోజకవర్గంలోని మర్రిగూడ మండల కేంద్రంలో హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్ సమక్షంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కిటకిట రాజు కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సతీష్ కుమార్ మాట్లాడుతూ… తమ పార్టీ కార్యకర్తలు ప్రచారంలో భాగంగా మునుగోడు నియోజకవర్గానికి విచ్చేసి జన్మదినం సైతం ఈ ప్రాంతంలో జరుపుకోవడం అభినందనీయమన్నారు.ఇలాంటి నిబద్ధతగల కార్యకర్తలు టిఆర్ఎస్ పార్టీ లోనే ఉంటారని పేర్కొన్నారు. కిటకిట రాజు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆయురారోగ్యాలతో జీవించాలని ఎమ్మెల్యే ఆశీర్వదించారు. అదేవిధంగా పలువురు మండల నాయకులు కిటకిట రాజుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఎంపీపీల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి సర్పంచ్ల ఫోరం అధ్యక్ష, కార్యదర్శులు చందా శ్రీనివాస్, కాయిత రాములు, సింగల్ విండో అధ్యక్షులు బిల్ల వెంకట్రెడ్డి, మాజీ జెడ్పిటిసి బెదరకోట రవీందర్ ,నాయకులు ఏరుకొండ సుధీర్, రుద్రారపు రవితేజ తదితరులు ఉన్నారు.