ఎమ్మెల్యే సహకారంతోనే మార్కెట్ కమిటీ అభివృద్ధి.
కోటి రూపాయలతో షెడ్డు నిర్మాణం.
10 లక్షలతో సీసీ కెమెరా లు ఏర్పాటు.
మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్.
తాండూరు అక్టోబర్ 20(జనంసాక్షి)వికారాబాద్ జిల్లా తాండూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి కాలం రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్ జనం సాక్షి మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి సహకారంతో మార్కెట్ కమిటీ లో కోటి రూపాయలతో షెడ్డు నిర్మాణం పనులు అదేవిధంగా 10 లక్షలతో సీసీ కెమెరా లు ఏర్పాటు,రూ10 లక్షలతో రైతులకు విశ్రాంతి భవనము,రూ10 లక్షలతో బాత్రూంల నిర్మాణం చేపట్టడం జరిగిందని తెలిపారు. దీంతోపాటు అమాలి కార్మికులకు 75శాతం చార్జీలు పెంచామని తెలిపారు.అయితే నూతన మార్కెట్ 30 ఎకరాల స్థలంలో శిలాఫలకం వెయ్యలేకపోయామని మునుగోడు ఎన్నికల అనంతరం కార్యక్రమం నిర్వహిస్తామని పేర్కొన్నారు.రెండు సంవత్సరాల మార్కెట్ కమిటీ పదవి కలంలో మార్కెట్ కమిటీ నూతనంగా ఎమ్మెల్యే సహకారంతో అనేక నిధులు తీసుకువచ్చి అభివృద్ధికి కృషి చేశామని తెలిపారు. రెండు సంవత్సరాల పదవి కాలంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్లు తమకు సహకరించి నందుకు వారికి ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు .అదే విధంగా మార్కెట్ కమిటీ పాలకవర్గంతో పాటు అధికారులకు తదితరులకు కృతజ్ఞతాభి వందనాలు తెలిపారు.