ఎమ్మెల్యే సారు… గ్రామంలో కోళ్ళ ఫారం కంపు లో ఎలా బ్రతకాలి?

 

గ్రామ సర్పంచి జక్కుల లింగయ్య యాదవ్

 

అచ్చంపేట ఆర్సీ, అక్టోబర్3,(జనం సాక్షిన్యూస్): ఉప్పునుంతల మండలం ఈరట్వని పల్లి గ్రామంలో ప్రయివేటు స్వంత భూమిలో కోళ్ల ఫారం షెడ్ల నిర్మాణం చేపట్టొద్దని తద్వారా దుర్గంధ భరిత వాసన, పాములు,దోమల తో గ్రామ ప్రజలు అనారోగ్య భారిన పడతారని సర్పంచ్ జక్కుల లింగయ్య యాదవ్ తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఊరికి 200 వందల మీటర్ల దూరంలో కోళ్ల ఫారం నిర్మాణం చేయొద్దని గ్రామ పంచాయతీ పరిధిలో ప్రజల మధ్య గ్రామ సభ తీర్మానం ప్రవేశపెట్టామని అయిన గ్రామప్రజల ఆరోగ్య సమస్యల ను భేఖాతార్ చేస్తూ కేవలం ఇదే గ్రామానికి చెందిన వ్యక్తి కేషమోని లింగమ్మ పెరు మీద చేపట్టిన కోళ్ల ఫారం వ్యాపారం మాటున దుర్గంధ భరిత కంపు తో దాదాపు గ్రామం లోని వందల కుటుంబాలు స్వచ్ఛమైన గాలిని కూడా పీల్చుకోలేని దౌర్భాగ్యం నెలకొంది అని అన్నారు. గ్రామంలో ని పసిపిల్లలు ,పండు ముసలి అని తేడా లేకుండా ఆరోగ్యమైన జీవితాన్ని పొందే హక్కు ను కోల్పోతున్నామని తెలిపారు. ఇదే సమస్య పై స్థానిక ఎమ్మెల్యే గువ్వల బాలరాజు దృష్టికి తీసుకెళ్లామని ,మానవ హక్కుల కమిషన్ లో, జిల్లా కలెక్టర్ కార్యాలయం లోని ప్రజావాణి లో,కాలుష్య నియంత్రణ మండలి తో పాటు మండల స్థాయి అధికారులకు విన్నవించుకున్న మా గోస పట్టించుకునే వారే లేరని పైగా కోళ్ల ఫారం చేపట్టే వ్యక్తి కి మద్దతు గా వంత పాడుతున్నారని అన్నారు .గతంలో పనిచేసిన పంచాయతీ సెక్రటరీ కృష్ణ ఇష్టానుసారంగా తమకు గాని గ్రామ ప్రజలకు గాని ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ప్రజల సంక్షేమం ఆరోగ్యం గాలికి వదిలేసి కోళ్ల ఫారం షెడ్ల అనుమతులకు అంకురార్పణ చేశాడని అన్నారు . ఈ సందర్భంగా ఎమ్మెల్యే గువ్వల బాలరాజు కు మా విన్నపం ఏమనగా మా గ్రామ పంచాయతీ పరిధిలోని ఈ కోళ్ల ఫారం షెడ్ల వలన భవిష్యత్తు లో కోళ్ల విసర్జన వ్యర్థాల వలన ప్రజల ఆరోగ్యం సంక్షేమం కోసం ప్రజా ప్రతినిధి గా ప్రజా శ్రేయ్యస్సు కోసం ఈ సమస్యను పరిగణనలోకి తీసుకోని కోళ్ల ఫారం షెడ్ల ను తొలగించాలని గ్రామ సర్పంచిగా ప్రజల పక్షాన నిలబడి కోరుతున్నానని ఇదే క్రమంలో ఎమ్మెల్యే గువ్వల బాలరాజు తన అంతరాత్మ ప్రకారం కేవలం ఒక వ్యక్తి స్వలాభం ముఖ్య మా! లేక వ్యవస్థ లోని ప్రజల సంక్షేమం ముఖ్యమో బహిరంగంగాతేల్చుకోవాలని సూచించారు. రాజకీయలకు అతీతంగా, స్వంత అభిప్రాయం తో కాకుండా ,ఒక వ్యక్తి ఆర్థికఅభివృద్ధి కోసం సంకుచిత మనస్తత్వం తో వ్యవహరించొద్దని వేడుకుంటన్నాను అన్నారు. గ్రామ పంచాయతీ పరిధిలోని రెండు వందల మీటర్ల దూరంలో కోళ్ల ఫారం నిర్మాణానికి అడ్డ దారిలో డిటీసీపీ అనుమతి తెచ్చుకోవడం ముమ్మాటికీ నిబంధనలను, చట్టాలను ఉల్లంఘించడమే అని ప్రశ్నించారు.అధికార యంత్రాంగ బలం తో గ్రామాల ప్రజల జీవించే హక్కును హరించే విదంగా అత్యంత పాశవికంగా శాసిస్తున్న ఎమ్మెల్యే అతని అండతో రెచ్చిపోతున్న సంబంధిత అధికారులు, కొందరు నేతలు కేసులు నమోదు చేస్తామని భయబ్రాంతులకు గురిచేస్తున్నారని కన్నీటి పర్యంతం అయ్యారు. కోర్టు ద్వారా ఏడు మందికి నోటీసులు పంపినారని దీనికి సంబంధించి గ్రామంలో ని ప్రజా ఆరోగ్యం సంక్షేమం కోసం కౌంటర్ పిటిషన్ దాఖలు చేశామని తెలిపారు. ఈ సమస్య పర్యవసానం సంఘటనలపై ఉప్పునుంతల పొలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసిన ఇప్పటికి అతిగతి లేదు అన్నారు. ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్ సంబంధించిన అదికారులు మానవత దృక్పథంతో స్పందించి ఈరట్ వాని పల్లి గ్రామంలో నిర్మించిన కోళ్ల ఫారం షెడ్లను వెంటనే తొలగించి గ్రామ ప్రజల భవిష్యత్తు తరాల ఆరోగ్యాన్ని కాపాడాలని కోరుతున్నాము అని అన్నారు.