ఎమ్మెల్సీగా తెలంగాణ వాదిని ఎన్నుకోండి

నిజామాబాద్‌, నవంబర్‌ 24 : ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలంగాణ వాదులకే ఓటు వేసి గెలిపించాలని టిఆర్‌ఎస్‌ పొలిట్‌ బ్యూరో సభ్యుడు స్వామిగౌడ్‌ కోరారు. శనివారం నిజామాబాద్‌ టీఎన్జీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పట్టభద్రుల ఎమెల్సీ స్థానానికి టీఆర్‌ఎస్‌ తనను ఎన్నుకుందని నిజామాబాద్‌, కరీంనగర్‌, మెదక్‌ జిల్లా చెందిన పట్టభద్రులు తనను గెలిపించాలని కోరారు. తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగుల పాత్ర కీలకమని గతంలో 42రోజుల పాటు చేపట్టిన ఉద్యోగుల సమ్మేతో మరోసారి నిరూపితమైందని ఆయన అన్నారు. పట్టభద్రులందరూ నవంబర్‌ 30వరకు తమ ఓటు హక్కును నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు. తెలంగాణ అంశాల కేంద్రం దృష్టికి తీసుకెళ్ళేందుకు తాను ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నానని అన్నారు. సీమాంధ్రకాంగ్రెస్‌ టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు వల్లే తెలంగాణ ప్రక్రియ వెనక్కి వెళ్ళిందని అన్నారు. విలేకరుల సమావేశంలో జేఏసీ నాయకులు డాక్టర్‌ బాపురెడ్డి, భాస్కర్‌, రాజారాం తదితరులు పాల్గొన్నారు.