ఎమ్మెల్సీలుగా కోదండరామ్,అజారుద్దీన్ ప్రమాణం

` ప్రమాణం చేయించిన మండలి చైర్మన్ గుత్తా
` హాజరైన సీఎం రేవంత్ తదిరులు
హైదరాబాద్(జనంసాక్షి):ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండరాం, అజారుద్దీన్ ప్రమాణస్వీకారం చేశారు. మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వారితో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితోపాటు పలువురు మంత్రులు హాజరయ్యారు. గవర్నర్ కోటాలో కోదండరాం, మహమ్మద్ అజారుద్దీన్‌లను ఎమ్మెల్సీలుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ఆదేశాల మేరకు సాధారణ పరిపాలన శాఖ ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రమాణస్వీకారం అనంతరం ఎమ్మెల్సీ కోదండరాం మాట్లాడుతూ.. తనకు మంత్రి పదవిపై ఆశ లేదని వ్యాఖ్యానించారు. పదవులు అనేవి శాశ్వతం కాదని స్పష్టం చేశారు. ఒకాయన తాను పోరాడాతానా లేదా అని అన్నారని.. తాను పోరాడి చూపిస్తానని చెప్ప్పుకొచ్చారు. గతంలో తనపై అనేక కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అయిన తన పని ఆగలేదని.. కొనసాగుతోందని స్పష్టం చేశారు. వివాదాస్పద సమస్యకు పరిష్కారం లభించిందని అన్నారు. లక్ష్యాలను ఎంచుకొని పనిచేస్తానని స్పష్టం చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉద్యమకారుల సమస్యలు, ఆదివాసుల సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తానని అన్నారు. ఇప్పటివరకు చేస్తున్న పనిని సమర్థవంతంగా పూర్తి చేయడానికి తనకు ఎమ్మెల్సీ ఉపయోగపడుతుందని వెల్లడించారు. జయశంకర్‌కు ఇచ్చిన మాట ప్రకారం ముందుకు పోతానని తెలిపారు. గతంలో ఏ రకంగా తన జీవన శైలి ఉందో.. భవిష్యత్తులో కూడా అదేవిధంగా ఉంటుందని స్పష్టం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం తాను నిలబడతానని.. వారికి ఎప్ప్పుడు అందుబాటులో ఉంటానని కోదండరాం పేర్కొన్నారు మంత్రి అజారుద్దీన్ విÖడియాతో మాట్లాడుతూ.. ఎమ్మెల్సీగా తనను ప్రతిపాదించిన కాంగ్రెస్ అధిష్ఠానానికి, మంత్రి మండలికి, పీసీసీకి ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీల సంక్షేమానికి ఎంతో ప్రాధాన్యం ఇస్తోందని చెప్పారు. మైనార్టీల సంక్షేమం కోసం మరింత కషి చేస్తానన్నారు. రాజకీయాల్లో, జీవితంలో ఎత్తుపల్లాలు వస్తుంటాయి. అన్నింటినీ అధిగమిస్తూ ముందుకు సాగాలి. జూబ్లీహిల్స్‌లో ముస్లింల ఓట్ల కోసమే మంత్రి పదవి ఇచ్చారనేది వాస్తవం కాదు. సీఎం రేవంత్‌రెడ్డి మొదట్నుంచీ మైనార్టీలకు పెద్దపీట వేస్తున్నారని అన్నారు.