ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి చొరవతో జగన్నాథ్ పూర్ గ్రామానికి ఆర్టీసీ బస్సు పునరుద్ధరణ

జనం సాక్షి జూలై 26 రాయికల్ ….

వర్షాల కారణంగా వరదలు వచ్చి జగన్నాథ్ పూర్ గ్రామంలో ఇండ్లు పంట పొలాలు పత్తి చేను నష్టపోయినరు అని తెలుసుకొని సోమవారం పరామర్శకు వెళ్లినా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గ్రామస్తులంతా మాకు బస్సు సౌకర్యం లేక చాల ఇబ్బందులకు గురవుతున్నామని విన్నవించారు ఉన్న బస్సు తొలగించారని తెలుసుకొని వెంటనే జగిత్యాల ఆర్ టి సి డిపో మేనేజర్ మరియు RM కరీంనగర్ గారితో మాట్లాడి బస్సును పునరుద్ధరించాలని కోరారు స్పందించిన ఆర్టీసీ వారు ఈరోజు బస్సు పునరుద్ధరించారు దీంతో గ్రామస్తులంతా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు