ఎయిడ్స్ వ్యాధిగ్రస్థులకు ఎటిఎం ద్వారా పింఛన్
శ్రీకాకుళం, జూలై 12 : రిమ్స్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ఎఆర్టిలో మందుల వాడుతున్న హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధిగ్రస్థులకు ఇకపై ఎటిఎం ద్వారా పింఛన్ మంజూరు చేయనున్నట్లు రిమ్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ రామ్మూర్తి ఒక ప్రకటనలో తెలిపారు. కనీసం ఆరు నెలలుగా మందులు క్రమం తప్పకుండా వాటిన వారు తెల్లరేషన్‌కార్డు, లేదా రాజీవ్ ఆరోగ్య శ్రీ కార్డు ఉన్న వారు మాత్రమే పింఛన్‌కు అర్హులని చెప్పారు. మందులు వాడుతున్న వారు ఈ నెల 18వ తేదీలోగా తమ ఆకుపచ్చ పుస్తకం, తెల్లరేషన్‌కార్డు, రాజీవ్ ఆరోగ్యశ్రీ జిరాక్స్ పత్రంతో తమ పేరును ఎఆర్‌పి కేంద్రంలో నమోదు చేసుకోవాలన్నారు.