ఎరువుల కోసం రైతుల రాస్తారోకో
మెదక్: ఎరువుల కొరతపై రైతన్నలు గళమెత్తారు. తమకు సరిపడా ఎరువులను సరఫరా చేయడం లేదంటూ జిల్లాలో రైతులు రాస్తారోకోకు దిగారు. తూఫ్రాన్, ఆంథోల్, జోగిపేటల్లో రైతులు ఎరువుల కొరతకు నిరసనగా ఆందోళన చేపట్టారు. రోడ్లపై బైఠాయించి నినాదాలు చేశారు.