*ఎల్ఐసిలో ఏజెంట్లను లేకుండా చేయాలనే కుట్రను అడ్డుకుంటాం.
కరీంనగర్ టౌన్ అక్టోబర్ 14(జనం సాక్షి)
ఎల్ఐసి ఏజెంట్లు కరీంనగర్ 1వ బ్రాంచ్ ఆఫీస్ ఆవరణలో గత నాలుగు రోజులుగా చేస్తున్న సమ్మెకు శుక్ర వారం ఆల్ ఇండియా ఫోర్వర్డ్ బ్లాక్ కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి శేఖర్ సంపూర్ణ మద్దతు తెలియజేసారు. కేంద్ర బిజెపి ప్రభుత్వం ఎల్ఐసి ని పూర్తిగా ప్రయివేట్ చేస్తున్నారని, ప్రజలకు ఎల్ఐసిని చేరువ చేయడంలోను, పాలసీలు చేపించడంలో ఏజెంట్ల పాత్ర కీలగంగా ఉన్నారని అన్నారు. ఈరోజు ఎల్ఐసికి లక్షల కోట్లు ఆస్తులు, పాలసీ దారులు ఉన్నారంటే దీనికి ఎజెంట్లే ముఖ్యపాత్ర అని అన్నారు. ఏజెంట్లకు వచ్చే కొద్దిపాటి కమిషన్ రాకుండా చేస్తూ ఆన్లైన్ విధానం తేవడం, ప్రయివేట్ వ్యక్తులకు ఇవ్వడం దుర్మర్గం అని అన్నారు. పాలసీదారులకు బోనస్ రెట్లు పెంచాలని డిమాండ్ చేశారు. పాలసీ లోన్లపై వడ్డీరెట్లు తగ్గించాలని, పోస్టల్ ప్రింటింగ్ బాండ్లను ఆపాలని అన్నారు.
ఐదు సం౹౹ రాలు దాటి LAPS ఐన పాలసీలను పునరుద్దరించాలని డిమాండ్ చేశారు. ప్రీమియంపై GST ని – తొలగించాలి. ప్రీమియం వడ్డీపై GST ని తొలగించాలని డిమాండ్ చేశారు. ఏజెంట్ల గ్రాట్యూటి పెంచాలని,
CLIA ప్రయోజనాలను పెంచాలని, గ్రూపు ఇన్సూరెన్సును పెంచాలి.టర్మ్ ఇన్సూరెన్స్ పెంచాలని డిమాండ్ చేశారు. వీటిని సాదించుకోవడం కోసం ఏజెంట్లు ఐక్యంగా పోరాటాలు ఉదృతం చేయాలని పిలుపునిచ్చారు. కేంద్ర బిజెపి ప్రభుత్వం ప్రభుత్వ సంస్థలను బ్యాంకులను, రైల్వేను, బొగ్గు, రోడ్లను కూడా బిజెపి ప్రభుత్వం ప్రయివేట్ చేస్తున్నదని తెలియజేసారు. ఒక్క ఎల్ఐసి లోనే దేశవ్యాపితంగా 13లక్షల మంది ఏజెంట్లు పనిచేస్తున్నారని ప్రయివేట్ చేస్తే వారి కుటుంబాలను రోడ్డు మీదికి వస్తారని ఆందోళన వ్యక్తం చేశారు.
కేంద్ర బిజెపి విధానాలకు వ్యతిరేకంగా ఏజెంట్లు గట్టి గుణపాఠం చెప్పే పద్ధతిలో పోరాటాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు.
సమ్మె శిబిరాన్ని సందర్శించిన వారిలో వారు బ్లాక్ పార్టీ జిల్లా నాయకులు గొల్లపల్లి ప్రశాంత్, హరీష్, అజయ్, సందీప్, కిట్టు తదితరులు పాల్గొన్నారు.