ఎల్ఐసి యాజమాన్యం నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ఏజెంట్ల గేటు ధర్నా
దంతాలపల్లి సెప్టెంబర్ 16 జనం సాక్షి
భారతీయ జీవిత భీమా (ఎల్ఐసి) పాలసీదారుల, ఏజెంట్ల ప్రయోజనాలను కాపాడాలంటూ నిరవధిక సమ్మె చేస్తున్నా పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న యాజమాన్యం మొండి వైఖరికి నిరసనగా లియాఫీ 1964 జాతీయ కమిటీ, జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపుమేరకు శుక్రవారం గేటు ధర్నా నిర్వహించినట్లు లియాఫీ 1964 మహబూబాబాద్ బ్రాంచ్ ప్రధాన కార్యదర్శి పాశం రమేష్ తెలిపారు.తొర్రూర్ డివిజన్ కేంద్రంలోని ఎల్ఐసి కార్యాలయం ముందు ఉదయం 12 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు గేటు ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఎల్ఐసి పాలసీలపై జీఎస్టీ రద్దు చేయాలని, పాలసిదారులకు బోనస్ రేట్లు పెంచాలని, ఐదు సంవత్సరాలకు పైగా బకాయి పడిన ల్యాబ్స్ పాలసీలను పునరుద్ధరించుకునే అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు అదేవిధంగా పాలసీదారులు,ఏజెంట్లు కార్యాలయంలో అందజేసే ఏ విధమైన డాక్యుమెంట్లకైనా రసీదు ఇవ్వాలన్నారు. ఏజెంట్లను ప్రొఫెషనల్ గా గుర్తించాలని వారి పిల్లలకు ఎడ్యుకేషన్ అడ్వాన్స్ ఇవ్వాలని అన్నారు ఏజెంట్ల మెడి క్లయిమ్, టర్మ్ ఇన్సూరెన్స్ ను పెంచాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో లియాఫీ 1964 వరంగల్ డివిజన్ ఈసీ మెంబర్ రేగూరి వెంకన్న, మహబూబాబాద్ బ్రాంచ్ ఉపాధ్యక్షులు బాణాల బిక్షపతి, కార్యవర్గ సభ్యులు ఇటికేల రాంబాబు, నాగేశ్వరరావు,ఎల్ల గౌడ్, హరికృష్ణ,యాకన్న, మల్లికార్జున్, వెంకన్న, ఉప్పలయ్య, కోటేశ్వరరావు, శ్రీనివాసులు, స్వాతి, తదితరులు పాల్గొన్నారు.