ఎల్వోసిని అందచేసిన ఎమ్మెల్యే భీరం హర్షవర్ధన్ రెడ్డి.
కోడేరు (జనం సాక్షి) అక్టోబర్ 10 కోడేరు మండలం ముత్తిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన యం.రుక్నమ్మ భర్త వెంకటయ్య కి హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో మెరుగైన వైద్యం కోసం సి ఎం ఆర్ ఎఫ్ పథకం కింద మంజూరు అయిన రూ.*1,25,000/-* ఎల్వొసిని ఎమ్మెల్యే భీరం హర్షవర్ధన్ రెడ్డి నేడు వారి కుటుంబ సభ్యులకు అందచేశారు.
రుక్నమ్మ కి ఇంతకుముందే *2,00,000/-* రూపాయల ఎల్వోసిని ఎమ్మెల్యే భీరం హర్షవర్ధన్ రెడ్డి, మంజూరు చేశారు,వారి వినతి మేరకు ఎమ్మెల్యే ప్రత్యేక చొరవ తీసుకుని వారికి 1,25,000/- (మొత్తం 3,25,000/-)* రూపాయల ఎల్వోసిని నేడు మంజూరు చేయించి నేడు అందచేశారు.
సీఎం సహాయనిధి కింద అందించే సాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఆపద సమయాల్లో వైద్య ఖర్చుల నిమిత్తం సీఎం సహాయనిది ఆపద్భందులగా ఆదుకుంటుందని, ప్రాణాపాయ స్థితిలో ఉన్న నిరుపేదలను కాపాడేందుకు తెలంగాణ ప‌్రభుత్వం ముఖ్యమంత్రి సహాయనిధి కింద చికిత్సకు తగిన ఆర్థిక సాయం బాధితులకు అందిస్తోందని ఎమ్మెల్యే భిరం హర్షవర్ధన్ రెడ్డి,అన్నారు.
తమ వినతిని మన్నించి ప్రత్యేక చొరవ తీసుకుని మొత్తం రూ.3,25,000/-రూ,,ల ఎల్వొసిని మంజూరు చేయించినందుకు ఎమ్మెల్యే కి ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన రుక్నమ్మ కుటుంబ సభ్యులు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే తో పాటు కొల్లాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కిషన్ నాయక్, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దూరేడి రఘువర్ధన్ రెడ్డి, కోడేరు మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సూర్య రాజశేఖర్ గౌడ్ సింగల్ విండో డైరెక్టర్ టిఆర్ఎస్ నాయకులు జగన్మోహన్ రెడ్డి,ప్రజా ప్రతినిధులు ,తెరాస నాయకులు,తదితరులు ఉన్నారు.