ఎవరి ధీమా వారిదే
శంకరపట్నం జనం సాక్షి 3 ; తెరాస అభ్యర్థి రసమయి బాలకిషన్ రాష్ట్ర ప్రభుత్వ పథకాలను ఎన్నికల ప్రణాళికలను ప్రజలకు వివరిస్తున్నారు తమ ప్రవేశపెట్టిన పథకాలు మళ్లీ గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేస్తూ ప్రచారం జోరు పెంచారు దాదాపు రెండు నెలల నుంచి రోజుకు ఐదు నుంచి ఎనిమిది గ్రామాలు ప్రచారం చేపడుతున్నారు రెండో దఫా ప్రచారం ముగించారు మంత్రులు హరీష్ రావు ఈటెల రాజేందర్ ద్వారా రోడ్ షో కూడా నిర్వహించారు ఇటీవల కరీంనగర్ లో కెసిఆర్ బహిరంగ సభ నిర్వహించడం తో విజయంపై ఆశలు పెంచుకున్నారు కాంగ్రెస్ :కాంగ్రెస్ అభ్యర్థి ఆరెపల్లి మోహన్ ప్రచారం ఊపందుకుంది నియోజకవర్గంలో రెండోదఫా ప్రచారం మొదలుపెట్టారు తమ హయాంలో చేసిన అభివృద్ధి పనులు పార్టీఎన్నికల ప్రణాళికను వివరిస్తూ ప్రచారం జోరు పెంచారు ముఖ్యంగా స్థానిక అభ్యర్థి అంటూ చెపుతూ తమదైన శైలిలో ప్రచారం సాగిస్తున్నారు గత ఎన్నికల్లో ఓడిపోయిన కూడా ప్రజలకు అందుబాటులో ఉంటున్నాను ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కరించుకునేందుకు చొరవ తీసుకుంటున్నాం అని హామీ ఇస్తున్నాను సినీ నటి విజయశాంతి ద్వారా మానకొండూరు రోడ్షో నిర్వహించి కార్యకర్తలకు ఉత్సవం నింపింది అన్నారు హైదరాబాదులో జరిగిన సోనియా గాంధీ రాహుల్ బహిరంగ సభ కూడా తమకు కలిసి వస్తుందని భావిస్తున్నారు ప్రభుత్వ వ్యతిరేక తో పాటు … తమ ఎన్నికల ప్రణాళిక తనను గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు భాజాపా :భాజపా అభ్యర్థి గడ్డం నాగరాజు కూడా తమదైన శైలితో ప్రచారం ముందున్నారు ఆరు మండలాల లో ప్రచారం సాగిస్తూ కేంద్ర ప్రభుత్వ పథకాలను వివరిస్తూ ప్రచారం జోరు పెంచారు తెరాస కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధి చేపట్టలేదని విమర్శిస్తూ రోడ్షోలు పెంచుతున్నారు రాష్ట్ర ప్రభుత్వ పథకాలలో కేంద్ర ప్రభుత్వం వాటా ఉందని ప్రచారం చేస్తూ గెలుపుపై ధీమా లో ఉన్నారు