ఎసిబికి చిక్కిన వ్యవసాయాధికారి

నిజామాబాద్‌, నవంబర్‌ 29 : ఎరువుల దుకాణానికి లైసెన్సును రెన్యువల్‌ చేయాలని కోరిన వ్యాపారస్తుల నుంచి వ్యవసాధికారి లంచం తీసుకుంటుండగా ఎసిబి అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. గురువారం జిల్లాలోని బాన్సువాడ పట్టణంలో ఈ సంఘటన జరిగింది. నిజాంసాగర్‌ మండలం మహ్మద్‌నగర్‌ గ్రామానికి చెందిన ఎరువుల వ్యాపారి బాలప్రకాశ్‌ తమ దుకాణానికి లైసెన్స్‌ రెన్యువల్‌్‌ చేయాలని వినతిపత్రం అందజేశారు. గత ఐదునెలలుగా బాన్సువాడ వ్యవసాయాధికారి కాజ మోహినుద్దీన్‌ ఐదువేల రూపాయలు డిమాండ్‌ చేస్తూ బాలప్రకాష్‌ను వేధింపులకు గురిచేస్తున్నాడు. దీంతో విసుగు చెందిన ఆయన ఎసిబి అధికారులను ఆశ్రయించారు. గురువారం ఎసిబి డిఎస్పీ శంకర్‌రెడ్డి నాయకత్వంలో బాన్సువాడ పట్టణంలో వ్యూహం ప్రకారం వ్యవసాయ అధికారితో ఐదు వేల లంచం తీసుకుంటుండగా రెడ్‌హ్యాడెండ్‌గా పట్టుకున్నారు. అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.