ఎస్ఐ ని ఘనంగా సత్కరించిన విశ్వకర్మలు

 హుస్నాబాద్ రూరల్ సెప్టెంబర్ 18(జనంసాక్షి) హుస్నాబాద్ పట్టణంలో విశ్వకర్మ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా హుస్నాబాద్ ఎస్ఐ సజ్జనపు శ్రీధర్ ని విశ్వకర్మలు శాల్వాతో ఘనంగా సత్కరించారు.విశ్వకర్మలు ఆలయాలతో పాటు తమ ఇళ్లల్లో విశ్వకర్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రపంచానికి పనిముట్లను అందజేసిన మహనీయుడు విశ్మకర్మ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పోలోజు రవీందర్,సంగోజు సత్యనారాయణ, గొల్లపల్లి వీరాచారి, శ్రీకాంత్,రాజకుమార్,ప్రవీణ్ పాల్గొన్నారు.