-ఎస్సీ వర్గీకరణ చేయకుండా బీజేపీ నేతలు మాదిగ పల్లెలకు రావద్దు.

-బీజేపీ మాదిగల రాజకీయ శత్రువుగా మారొద్దు.

-ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గోవిందు నరేష్ మాదిగ.
-ధీక్ష ను విరమింపజేసిన ఎంఇఎఫ్ రాష్ట్ర నాయకులు.

నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి, ఆగష్టు 9(జనంసాక్షి):

ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు చట్టబద్దత కల్పించకుండా బీజేపీ నేతలు మాదిగ పల్లెలోకి రావద్దని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు గోవిందు నరేష్ మాదిగ, ఎమ్మార్పీఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కోళ్ల శివ మాదిగ హెచ్చరించారు.
నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో కొనసాగుతున్న ఎమ్మార్పీఎస్ రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని మంగళవారం సందర్శించిన అనంతరం వారు మాట్లాడుతూ 2014 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే వర్గీకరణ చేస్తామని మాట ఇచ్చిన బీజేపీ నమ్మించి మోసం చేసిందని అన్నారు. దేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా లేవని బీజేపీ మాత్రమే నిర్లక్ష్యం చేస్తూ మాదిగలకు అన్యాయం చేస్తుందని అన్నారు. పార్లమెంట్ లో బిల్లు పెడితే అన్ని పార్టీల మద్దతుతో ఆమోదం పొందుతుందని అన్నారు.కానీ గత ఎనిమిది ఏండ్లుగా వర్గీకరణ అంశాన్ని బీజేపీ పట్టించుకోవడం లేదని అన్నారు.వర్గీకరణ సాధించుకునే దాక బీజేపీ మీద రాజీలేని పోరాటాన్ని మాదిగలు కొనసాగించాలని అన్నారు. యంఇఎఫ్ రాష్ట్ర నాయకులు వంకేశ్వరం నిరంజన్ దీక్ష శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపి దీక్ష విరమించారు.ఈ దీక్ష లో కూర్చున్న వారు ఎంఆర్పీస్ రాష్ట్ర సీనియర్ నాయకులు గూట విజయ్ మాదిగ, ఎంఆర్పీస్ నాగర్ కర్నూల్ మండల అద్యక్షులు నాగన్న, బోనాసి రాములు దేశాయ్,అంజి, కొమ్ము మోహన్, వంకేస్వరం రామకృష్ణ తదతరులు పాల్గొన్నారు.