ఎస్సీ వర్గీకరణ మా జన్మ హక్కు – సాధించే వరకు మా పోరాటం ఆగదు

జిల్లా సీనియర్ నాయకులు సుందరాజు,ఎల్కూర్ భాస్కర్, మోషన్న
మల్దకల్ జులై 2 (జనంసాక్షి) మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా సడక్ బంద్ కు పిలపునిచ్చిన నేపథ్యంలో శాంతి భద్రతల దృష్ట్యా శనివారం ఉదయం మల్దకల్ ఎస్సై శేఖర్ ఆధ్వర్యంలో  పోలీస్ బృందం జిల్లా ఎమ్మార్పీఎస్ నాయకులు,మండల ఎమ్మార్పీఎస్ నాయకులను ముందస్తుగా అదుపులోకి తీసుకొని పోలీస్ పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగింది.ఈ సందర్భంగా జిల్లా ఎమ్మార్పీఎస్ నాయకులు సుందరాజు,భాస్కర్, మోషన్న మాట్లాడుతూ జనాభా దామాషా ప్రకారం కేంద్ర బిజెపి ప్రభుత్వం ఎస్సీ 59 కులాలకు ఎస్సీ వర్గీకరణ చేస్తామని హామీ ఇచ్చి ఎనిమిది సంవత్సరాలు గడిచిన పార్లమెంటులో బిల్లు పాస్ చేయకపోవడం మాదిగలను వంచిస్థు మళ్లీ తెలంగాణ రాష్ట్రంలో బిజెపి జాతీయ సమావేశాలను ఏర్పాటు చేయడమంటే మాదిగల ఆత్మగౌరవాన్ని కించపరచడమేనన్నారు.ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం మాదిగల న్యాయమైన  డిమాండ్ ఎబిసిడి ఎస్సీ వర్గీకరణ చేపట్టేదాక పోరాటం తప్పదన్నారు.అరెస్ట్ అయిన వారిలో మల్దకల్ మండల మాజీ ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు అమరవాయి తిమ్మప్ప,మల్దకల్ ఎర్రన్న ( యాకోబు),మద్దెలబండ  లక్ష్మన్న, పాల్వాయి యల్లప్ప,ఎల్కూర్ రత్నం,వినోద్,బుచ్చన్న,ఆనంద్, కృష్ణ,తదితరులు పాల్గొన్నారు.
Attachments area