ఎస్సీ వర్గీకరణ సాధనకై ఎమ్మార్పీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు నిరసన దీక్షలు – 3వ రోజు*
*28 ఏళ్ల మాదిగల ఆకాంక్షను నెరవేర్చాలని కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్*
ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ జిల్లా కో-కన్వీనర్ మాతంగి చిరంజీవి మాదిగ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే చట్టబద్ధత కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నమన్నారు. దేశంలో ఎవ్వరూ అడగకపోయిన తామే స్వంతగా నిర్ణయం తీసుకొని ఎన్నో రకాల బిల్లులను పెట్టి ఆయా వర్గాల వారికి న్యాయం చేసిన చరిత్ర బిజెపి పార్టీకి ఉంది. కానీ న్యాయమైన డిమాండ్ కొరకు 28 సంవత్సరాలుగా ఎమ్మార్పియస్ చేస్తున్న వర్గీకరణ పోరాటానికి మేము మద్దతుగా ఉన్నామనీ, మేము కేంద్రంలోకి అధికారంలోకి వస్తే వంద రోజుల్లోనే వర్గీకరణ అంశాన్ని పూర్తి చేస్తామని హామీలనిచ్చి 8 సంవత్సరాలు గడిచిన కూడా ఆ ఊసే ఎత్తకపోవడాన్ని బిజెపి ప్రభుత్వ ద్వంద నీతికి, మోసపూరిత వైఖరికి నిదర్శనమని తెలిపారు. జూలై 3వ తేదీన హైదరాబాదులో జరిగినటువంటి బిజెపి బహిరంగ సభలో శాంతియుతంగా నిరసన తెలపడానికి వెళ్లిన ఎమ్మార్పీఎస్ నాయకులపై జరిగిన దాడిని ఖండిస్తూ మాదిగలకు క్షమాపణ చెప్పాలని, ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఎస్సీల ఏబిసిడి వర్గీకరణ బిల్లు చట్టబద్ధత కల్పించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు..
ఈ కార్యక్రమంలో మాదిగ మహిళా విభాగం ఉమ్మడి జిల్లా ఇన్చార్జి పెద్దగీత మాదిగ, ఎం.ఎం.ఎస్ జిల్లా నాయకురాలు ముక్కగల కవిత, తిమ్మగళ్ల లలిత, ఎమ్మార్పియస్ సీనియర్ నాయకులు పి.కృష్ణమాదిగ మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
*సామాజిక ఉద్యమ అభినందనలతో….*