ఎస్సీ వర్గీకరణ సాధించే వరకు పోరాటం ఆగదు…

తాసిల్దార్ కు వినతి పత్రం అందించిన ఎమ్మార్పీఎస్ నాయకులు.
– ఎమ్మార్పీఎస్ మండల కన్వీనర్ దార రాధాకృష్ణ.
ఊరుకొండ, ఆగస్టు 10 (జనం సాక్షి):
ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ బిల్లుకు పార్లమెంట్ లో చట్టబద్ధత కల్పించి ఎస్సీ వర్గీకరణ సాధించేవరకు ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో పోరాటం ఆగకుండా కొనసాగుతుందని ఎమ్మార్పీఎస్ మండల కన్వీనర్ దార రాధాకృష్ణ డిమాండ్ చేశారు. మంగళవారం
ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ బిల్లుకు పార్లమెంట్ లో చట్టబద్ధత కల్పించకుండా నిర్లక్ష్యం చేస్తున్న బీజేపీ మొండి వైఖరిని నిరసిస్తూ… ఊరుకొండ మండల కేంద్రంలోని తహాసిల్దార్ కార్యాలయంలో ఎమ్మార్పీఎస్ మండల కన్వినర్ దార రాధకృష్ణ మాదిగ గారి ఆధ్వర్యంలో వివిధ డిమాండ్లతో కూడిన వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా రాధాకృష్ణ మాదిగ మాట్లాడుతూ… ఎస్సీ వర్గీకరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశ పెట్టకుండా సమావేశాలు ముగించడం బీజేపీ నీతిమాలిన చర్యకు నిదర్శనం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 28 ఏండ్లు ఎస్సీ వర్గీకరణకు మద్దతు తెలిపి అధికారంలోకి వచ్చాక పార్లమెంట్ లో బిల్లు పెట్టడాన్ని విస్మరించడం దుర్మగమైన చర్య అని అన్నారు. మాదిగల అభివృద్ధి పట్ల బీజేపీకి ఏ మాత్రం పట్టింపు లేదని అన్నారు. తెలంగాణలో 50 లక్షల జనాభా కలిగిన మాదిగలను దూరం చేసుకొని బీజేపీ ఎట్లా అధికారంలోకి వస్తుందో చూస్తామని అన్నారు. బీజేపీ రాజకీయ పతనం మాదిగలతోనే మొదలవుతుందని మండి పడ్డారు.
నమ్మిన ప్రజలను మోసం, ద్రోహం చేసే బీజేపీ పార్టీకి ప్రజల్లో స్థానం ఉండదని విమర్శించారు. ఎస్సీ వర్గీకరణ సాధించేంత వరకు పోరాటం నడుస్తునే ఉంటుందని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు నరేష్, యాదయ్య, బంగారు, గణేష్, దయాకర్, మార్పు శివ, విశాల్, దార రాములు, బక్క నాగరాజు, దార రమేష్, బక్క శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు.