ఎస్సై పై దుష్ప్రచారం మానుకోవాలి ఎం ఆర్ పి ఎస్ నాయకులు

తిరుమలగిరి (సాగర్) ఆగస్టు 09, (జనం సాక్షి):
నల్గొండ జిల్లా తిరుమలగిరి (సాగర్) ఎస్సై పై దుష్ప్రచారం మానుకోవాలని మండల ఎమ్మార్పీఎస్ నాయకులు అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో స్థానిక ఎమ్మార్పీఎస్ నాయకులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. రెండు రోజులగా సోషల్ మీడియాలో ఎస్సై పై తప్పుడు ప్రచారాలు నిర్వహిస్తూ అతని ఇబ్బందులకు గురి చేస్తున్నారని, ఇటువంటి చర్యలు వెంటనే మానుకోవాలని హెచ్చరించారు. దళితుడైనందున అతనిని విధులు నిర్వహించకుండా, మానసికంగా ఇబ్బందులకు గురిచేస్తూ అసత్య ప్రచారాలు చేస్తూ అతనిపై నిందలు మోపుతున్నారని, ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. ఇటువంటి తప్పుడు ప్రచారాలు మానుకోకపోతే తాము సహించేది లేదని హెచ్చరించారు. కొందరు వ్యక్తులు కావాలనే పాత వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అతని విధులు సక్రమంగా నిర్వహించకుండా అడ్డుపడుతున్నారని, ఎస్సై విధుల పట్ల ప్రజల పట్ల అలసత్వం ప్రదర్శిస్తే దానిపైన ఉన్నతాధికారులు తగు విచారణ చేపట్టి అతనిపై శాఖపరమైన చర్యలు తీసుకుంటారని అంతేగాని ఉద్దేశపూర్వకంగా ఈ విధంగా సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేయటం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు ఇరిగి రామయ్య, మాజీ సర్పంచ్ ఇరిగి గంగయ్య, ఈగల ఎల్లయ్య, ఇరిగి గోపి, వరదబాక కలమ్మ, దావీదు, రవి ,లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు