ఎస్సై ప్రిలిమినరీ రాత పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు

జిల్లా ఇన్చార్జి ఎస్పీ రంజాన్ రతన్ కుమార్.

వనపర్తి :ఆగస్టు 5( జనం సాక్షి) వనపర్తి జిల్లా వ్యాప్తంగా ఆగస్టు 7న జరిగే ఎస్సై ప్రిలిమినరీ రాత పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఇన్చార్జి ఎస్పి రంజన్ రతన్ కుమార్ తెలిపారు శుక్రవారం వివరాలను ఆయన వెల్లడించారు జిల్లా వ్యాప్తంగా 9 పరీక్ష కేంద్రాలలో 3011 మంది అభ్యర్థులు పరీక్షలు రాయనున్నారని బయోమెట్రిక్ సిస్టంతో పూర్తి పారదర్శకంగా పరీక్ష నిర్వహించటం జరుగుతుందని తెలిపారు అభ్యర్థులు నియమ నిబంధనలు పాటించాలని తెలిపారు పరీక్షలు ఉదయం పది గంటల నుంచి 1:00 వరకు జరుగుతాయని పరీక్ష కేంద్రానికి విద్యార్థులు 9 గంటల లోపే చేరుకోవాలని తెలిపారు 10 గంటలకు పరీక్ష కేంద్రాల గేట్లు మూసి వేయబడతాయని ఒక్క నిమిషం ఆలస్యమైనా లోనికి అనుమతించడం జరగదని తెలిపారు హాల్ టికెట్ పై పాస్పోర్ట్ సైజు ఫోటో తప్పనిసరిగా అతికించుకోవాలని హాల్ టికెట్ లోని వివరాలు సరిచూసుకోవాలని కోరారు బ్యాగులు సెల్ ఫోన్లు స్మార్ట్ ఫోన్లు వాచ్లు క్యాలిక్యులేటర్లు తదితర ఎలక్ట్రానిక్ పరికరాలను కేంద్రంలో పలికి అనుమతించరని తెలిపారు హాల్ టికెట్ పెన్ను మాత్రమే తీసుకువెళ్లాలని కోరారు పరీక్ష పత్రంలో 200 ఆబ్జెక్టివ్ ప్రశ్నలు ఉంటాయని 200 మార్కులు కేటాయించారని తెలిపారు ప్రతి తప్పు సమాధానానికి నెగటివ్ మార్క్ ఉంటుందని తెలిపారు అందువల్ల జాగ్రత్తగా సమాధానాలను మార్క్ చేయాలని సూచించారు అభ్యర్థులు తమ రూమ్ నెంబర్ సీటు చేరుకుని ప్రశ్నాపత్రం కోడును పరిశీలించుకోవాలని తెలిపారు ఓఎంఆర్ షీట్స్ లో ఓఎంఆర్ వైట్నర్ ఉపయోగించరాదని తెలిపారు పరీక్షా కేంద్రం చుట్టూ 360 డిగ్రీలలో బందోబస్తు ఏర్పాటు జరుగుతుందని తెలిపారు పరీక్ష పూర్తిగా రీజినల్ కోఆర్డినేటర్ ప్రభుత్వ పాఠశాల పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తారని నోడల్ ఆఫీసర్ గా అదనపు ఎస్పీ షాకీర్ హుస్సేన్ ఉంటారని ఎవరికి ఎలాంటి సందేహాలు ఉన్న వీరి దృష్టికి తీసుకువచ్చి నివృత్తి చేసుకోవాలని తెలిపారు