ఎస్‌ఐకి ఘన సన్మానం
బేస్తవారిపేట, జూలై 11 : బేస్తవారిపేట వై శ్రీనివాసరావుకు ఆదివారం సాయిబాబా కళ్యాణ మండపంలో వీడ్కోలు సభ కార్యక్రమాన్ని నిర్వహించి ఘనంగా సన్మానించారు. ఆయన బేస్తవారిపేటలో విధులు నిర్వహిస్తూ బదిలీపై గిద్దలూరుకు బదిలీ కావడం జరిగింది. ఆయన వీడ్కోలు సభ కార్యక్రమంలో సిఐ సత్యనారాయణ, రాచర్ల ఎస్‌ఐ శ్రీనివాసులు హాజరయ్యారు. బేస్తవారిపేట ఎస్‌ఐ వై శ్రీనివాసరావు అనతికాలంలోనే అందరి మన్ననలు పొందారని ఏదైనా సమస్య వచ్చినప్పుడు అతను రకరకాలుగా ఆలోచించి న్యాయం చేసేవారని అలాంటి మంచి ఎస్‌ఐ బదిలీ కావడం ఎంతో బాధాకరమని బేస్తవారిపేట వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వేగినాటి ఓ సూరారెడ్డి, ఆర్నాల్డ్, బుడ్డ ఖాదర్, మండల తెలుగుదేశం పార్టీ నాయకులు పూనూరి భూపాల్‌రెడ్డి, సి భూపాల్‌రెడ్డి, డి మాబు, కాంగ్రెస్ పార్టీ నాయకులు బొల్లా బాలిరెడ్డి, వెంకటరావులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో మండలంలోని అన్ని పార్టీల నాయకులు, కార్యకర్తలు హాజరై ఎస్‌ఐ వై శ్రీనివాసరావు గురించి మాట్లాడారు. అనంతరం పోలీసు స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విందు కార్యక్రమంలో పాల్గొన్నారు. సిఐ నిమ్మగడ్డ సత్యనారాయణ మాట్లాడుతూ ఎస్‌ఐ వై శ్రీనివాసరావు పదవీబాధ్యతలు ఎంతో బాధ్యతయుతంగా, చాకచక్యంగా కేసులు విచారణ జరిపి న్యాయం చేసేవాడని, భవిష్యత్తులో ఆయన ఎన్నో ఉన్నత పదవులను సాధించాలని ఆయన కోరారు.