ఏఐఎస్ఎఫ్ వార్షికోత్సవాలను జయప్రదం చేయండి
– ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు పుల్లని వేణు
చేర్యాల (జనంసాక్షి) జులై : ఆగస్టు1 నుండి 12 వరకు అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ 87వ ఆవిర్భావ వార్షికోత్సవ సభలను జయప్రదం చేయాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు పుల్లని వేణు పిలుపునిచ్చారు. బుధవారం చేర్యాల మండల కేంద్రంలో ఆవిర్భావ దినోత్సవ కరపత్రాలను వారు విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 1936 ఆగస్టు 12న ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లక్నో నగరంలోని బనారస్ యూనివర్సిటీలో దేశంలోనే మొట్టమొదటి విద్యార్థి సంఘంగా ఏఐఎస్ఎఫ్ ఆవిర్భవించిందని, భారతదేశ స్వాతంత్రోద్యమంలో విద్యార్థి లోకాన్ని చైతన్యపరిచి, ఏకం చేసుకొని వీరోచిత పోరాటాలు నిర్వహిందన్నారు. నాటి నుండి నేటి వరకు విద్యార్థులు ఎదుర్కొంటున్న అనేక రకాల సమస్యల పరిష్కారం కోసం రాజీ లేని పోరాటాలు నిర్వహిస్తున్న ఏకైక విద్యార్థి సంఘం ఏఐఎస్ఎఫ్ అని వారు స్పష్టంచేశారు. ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విద్యార్థులందరికి అవగాహన కల్పించేందుకు,ఈ ప్రభుత్వాల విద్యారంగ వైఫల్యాలను ఎడగట్టడానికి ఆగస్టు 1 నుండి 12 వరకు ఏఐఎస్ఎఫ్ ఆవిర్భావ దినోత్సవ సభలను నిర్వహిస్తున్నామని వీటిలో విద్యార్థులు, మేధావులు వంటి వారు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ మండల నాయకులు ఎర్రోళ్ల అఖిల్, ఛత్రపతి, మానస, రజిత, శిరీష, కవిత, రోజా, రాజు, మహేశ్వరి తదితరులు పాల్గొన్నారు.
Attachments area